సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం వెంకటాపురం గ్రామంలో తేనెటీగలు ఒక్కసారిగా దాడి చేయడంతో అనేకమంది గ్రామస్తులు తీవ్రంగా గాయపడ్డారు. బాధితుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో 108 అంబులెన్స్ సరిపోలేదు. ప్రాణభయంతో బాధితులు స్వచ్ఛందంగా వాహనాల్లోనూ, కాలినడకన ఆసుపత్రికి వెళ్లారు. గాయపడిన వారందరికీ సదాశివపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.