AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: గుండె బరువెక్కే సందర్భం.. ఓవైపు ఇంట్లో నాన్న శవం.. మరోవైపు..

ఇదొక గుండె బరువెక్కే సందర్భం… జీవితంలో ఎవరికీ రాకూడని దుఃఖ బాధ. ప్రతి విద్యార్థికి పదో తరగతి పరీక్ష అనేది తన జీవితంలో తొలి మెట్టులాంటిది. భవిష్యత్తును నిర్దేశించే.. తొలి అడిగే పదవ తరగతి పరీక్షలు. ఈ సమయంలో పిల్లలు ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా పరీక్షలు రాసేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. చనిపోయిన తండ్రి మృతదేహం ఇంటి ముందు ఉండగా.. కుటుంబ సభ్యులు గుండెలు బాదుకుంటున్న వేళ.. దు:ఖాన్ని దిగమింగుకుని పదో తరగతి పరీక్షకు హాజరయ్యాడో విద్యార్థి. ఈ విషాద ఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

Telangana: గుండె బరువెక్కే సందర్భం.. ఓవైపు ఇంట్లో నాన్న శవం.. మరోవైపు..
Ellaiah Harshavardhan
M Revan Reddy
| Edited By: |

Updated on: Mar 14, 2026 | 12:02 PM

Share

యాదాద్రి జిల్లా మోత్కూర్‌కు చెందిన కూరేళ్ల ఎల్లయ్య.. గుండాల మండలం వస్తాకొండూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఎల్లయ్యకు ఇద్దరు కొడుకులు, కుమార్తె ఉన్నారు. కూతురు ఇంటర్మీడియట్ చదువుతుండగా, పెద్దకొడుకు టెన్త్ క్లాస్, చిన్న కొడుకు ఎనిమిదవ తరగతి చదువుతున్నారు. పిల్లలను బాగా చదివించి ప్రయోజకులుగా తీర్చిదిద్దాలనేది ఎల్లయ్య ఆశయం. టెన్షన్ లేకుండా పదవ తరగతి పరీక్షలు రాసేందుకు కొడుకు హర్షవర్ధన్‌కు తండ్రి ఎల్లయ్య సూచనలు చేశాడు. రాత్రి పడుకునే సమయంలో ఎల్లయ్యకు ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. దీంతో స్థానికంగా వైద్యులు చికిత్స చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో ఎల్లయ్య గుండెపోటుతో విగత జీవిగా మారిపోయాడు. రాత్రి నుంచి ఏడుపులతో ఆ ఇంట విషాదం నెలకుంది. తెల్లవారితే పదవ తరగతి పరీక్షలు.. రాత్రంతా హర్షవర్ధన్‌కు నిద్రలేని రాత్రిగా మారింది.

ఒకవైపు కళ్లముందే విగతజీవిగా పడి ఉన్న కన్నతండ్రి.. మరోవైపు తన భవిష్యత్తును నిర్ణయించే పదవ తరగతి పరీక్షలు. ఈ రెండింటి మధ్య నలిగిపోయిన ఆ విద్యార్థి వేదన వర్ణనాతీతం. తండ్రి మరణంతో ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకొంటూ.. బాధను దిగమింగుకొని పుట్టెడు దుఃఖంతో విద్యార్థి హర్షవర్ధన్ పదోతరగతి పరీక్షకు హాజరయ్యాడు. పరీక్షా హాల్లో ప్రశ్నపత్రం ముందు ఉన్నా, అతడి మనసంతా నాన్న జ్ఞాపకాలతోనే నిండిపోయింది. కన్నీటి పర్యంతమవుతూనే పరీక్ష రాస్తున్న ఆ బాలుడిని చూసి తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు సైతం చలించిపోయారు. తండ్రికి ఇచ్చే నిజమైన నివాళి ఆయన ఆశయాన్ని నెరవేర్చడమేనని నిరూపించిన హర్షవర్ధన్ ధైర్యం అందరినీ ఓ పాఠంగా నిలిచింది. తెలుగు పరీక్ష అనంతరం హర్షవర్ధన్ తండ్రికి అంత్యక్రియలు నిర్వహించాడు.

ప్రాణప్రదమైన తండ్రి మరణం వంటి బాధను ఎదుర్కొని అతడు రాసిన ఈ పరీక్ష, కేవలం మార్కుల కోసం కాదు.. ఒక తండ్రి కల కోసం అని, ఆ విద్యార్ధికి భగవంతుడు ధైర్యాన్నివ్వాలని అందరూ కోరుకున్నారు.

Also Read: గుడ్ న్యూస్.. Hi అని మెసేజ్ పెట్టగానే ప్రభుత్వ ఆస్పత్రిలో ఓపీ.. భారీ క్యూలైన్లకు చెక్

Follow Us
ఎంత కష్టం చిన్నా.. నువ్వు జీవితంలో గొప్పగా ఎదగాలి...
ఎంత కష్టం చిన్నా.. నువ్వు జీవితంలో గొప్పగా ఎదగాలి...
జింబాబ్వే స్టార్ పేసర్ దెబ్బకు పాక్ క్రికెట్ బోర్డ్ మైండ్ బ్లాక్
జింబాబ్వే స్టార్ పేసర్ దెబ్బకు పాక్ క్రికెట్ బోర్డ్ మైండ్ బ్లాక్
వాట్సాప్‌లోనే ప్రభుత్వ ఆస్పత్రి ఓపీ స్లిప్... క్యూలైన్లకు చెక్
వాట్సాప్‌లోనే ప్రభుత్వ ఆస్పత్రి ఓపీ స్లిప్... క్యూలైన్లకు చెక్
మీ వాహనంపై ట్రాఫిక్‌ చలాన్స్‌ ఉన్నాయా..? మీకో అదిరిపోయే శుభవార్త
మీ వాహనంపై ట్రాఫిక్‌ చలాన్స్‌ ఉన్నాయా..? మీకో అదిరిపోయే శుభవార్త
ఐఐటి హైదరాబాద్‌లో కెమికల్ ఇంజనీరింగ్‌లో AI/ML ప్రోగ్రాం ప్రారంభం
ఐఐటి హైదరాబాద్‌లో కెమికల్ ఇంజనీరింగ్‌లో AI/ML ప్రోగ్రాం ప్రారంభం
అలేఖ్య తారకరత్న మనసులోని మాట.. ఆమెకు ఎప్పుడూ ప్రత్యేక స్థానం
అలేఖ్య తారకరత్న మనసులోని మాట.. ఆమెకు ఎప్పుడూ ప్రత్యేక స్థానం
చెరుకు రసం తాగుతున్నారా..? ఈ విషయాలను తెలుసుకోండి..
చెరుకు రసం తాగుతున్నారా..? ఈ విషయాలను తెలుసుకోండి..
దుబాయ్, బాగ్దాద్‌పై విరుచుకుపడ్డ ఇరాన్‌..!
దుబాయ్, బాగ్దాద్‌పై విరుచుకుపడ్డ ఇరాన్‌..!
10 రోజులు చక్కెర మానేస్తే మీ శరీరంలో జరిగే అద్భుతాలు తెలిస్తే..
10 రోజులు చక్కెర మానేస్తే మీ శరీరంలో జరిగే అద్భుతాలు తెలిస్తే..
రాగి జావ ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు మావ..
రాగి జావ ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు మావ..