భూతడి అమావాస్య రోజు దుష్టశక్తుల ప్రభావం .. అస్సలే చేయకూడని పనులు ఇవే!

Samatha

14 march 2026

మార్చి 19న అమావాస్య వస్తుంది. ఫాల్గుణ మాసం ఆఖరి రోజు, ఉగాది ముందు రోజు వచ్చే ఈ అమావాస్యను భూతడి అమావాస్య అంటారు.

అమావాస్య

అయితే ఈ భూతడి అమావాస్య రోజు దుష్టశక్తుల అధిపత్యం ఎక్కువగా ఉంటది అంటారు. అందుకే తప్పకుండా ఈ రోజు అస్సలే కొన్ని పనులు చేయకూడదంట.

చేయకూడని పనులు

భూతడి అమాస్య రోజు, అర్ధరాత్రి బట్టలను బయట ఆరబెట్టకూడదంట. ఎందుకంటే, దుష్టశక్తుల చురుకుగా ఉంటాయి. కాబట్టి బట్టల ద్వారా వ్యక్తులపై ప్రభావం చూపుతాయి.

బట్టలు ఆరేయకూడదు

అలాగే ఈ రోజున అస్సలే సూర్యాస్తమయం తర్వాత చీపురు వాడకూడదంట. దీని వలన ఆర్థిక సమస్యలు పెరుగుతాయని చెబుతున్నారు నిపుణులు.

చీపురు వాడకూడదు

అమావాస్య రోజున మాంసాహారం, మద్యం తీసుకోవడం అస్సలే మంచిది కాదంట. దీని వలన అనేక సమస్యలు ఎదుర్కునే ఛాన్స్ ఉందంట.

మాంసాహారం

అమావాస్య రోజున ఎప్పుడూ కూడా కొత్త పనులు ప్రారంభించకూడదు. ముఖ్యంగా శుభకార్యాలు నిర్వహించడం అస్సలే మంచిదికాదంట.

కొత్త పనుల ప్రారంభం

భూతడి అమావాస్య రోజు ఇంట్లో గొడవలు పెట్టుకోవడం, కోపం, తప్పుగా మాట్లాడటం వంటివి చేయడం వలన కూడా అస్సలే మంచిది కాదు అని చెబుతున్నారు నిపుణులు.

గొడవలు

నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

గమనిక