రాత్రి త్వరగా నిద్ర పట్టాలి అంటే తప్పక పాటించాల్సిన టిప్స్ ఇవే!

Samatha

07 march 2026

నిద్ర ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే ప్రతి ఒక్కరూ రాత్రి సమయంలో కంటి నిండా నిద్రపోవాలి అంటారు. ముఖ్యంగా ఒక వ్యక్తి కనీసం 6 నుంచి ఏడు గంటల పాటు నిద్రపోవాలి అంటారు.

నిద్ర 

కానీ ఈ మధ్య కాలంలో స్మార్ట్ ఫోన్ ఎఫెక్ట్, సోషల్ మీడియాలో ఎక్కువ సేపు గడుపుతూ సరిగ్గా నిద్రపోవడం లేదు. ఇది అనేక అనారోగ్య సమస్యలకు కారణం అవుతుంది.

అనారోగ్య సమస్యలు

కాబట్టి, అసలు రాత్రి సమయంలో చాలా త్వరగా నిద్రపట్టాలి అంటే ఏం చేయాలి? ఎలాంటి టిప్స్ పాటించడం వలన త్వరగా, కంటి నిండా నిద్ర పడుతుందో ఇప్పుడు చూద్దాం.

ఆరోగ్య చిట్కాలు

ఒకే సమయానికి నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి. దీని వలన జీవ గడియారం కూడా సరిగ్గా పని చేసి, ప్రతి రోజూ ఒకే సమయాని త్వరగా నిద్ర పట్టేస్తుంది.

ఒకే సమయానికి నిద్రపోవడం

అలాగే రాత్రి సమయంలో పడుకోవడానికి అరగంట ముందు టీ లేదా కాఫీ తాగడం మానెయ్యాలి, లేకపోతే ఇది మీలో నిద్రలేమి కారణం అవుతుంది.

టీ, కాఫీలు తాగకూడదు

స్క్రీన్ టైమ్ తగ్గించుకోవడం. పడుకోవాడానికి కనీసం 20 నిమిషాల ముందు,  స్మార్ట్ ఫోన్, ల్యాప్ టాప్ వంటి వాటిని పక్కన పెట్టెయ్యాలి. దీని వలన బ్లూలైట్ ఉత్పత్తి తగ్గి, త్వరగా నిద్రపడుతుంది.

స్క్రీన్ టైమ్ తగ్గించుకోవడం

ప్రతి రోజూ ఉదయం తప్పకుండా వ్యాయామం చేయాలి. ప్రతి రోజూ ఎవరు అయితే తప్పకుండా వ్యాయామం చేస్తారో వారు చాలా త్వరగా నిద్రపోతారు.

వ్యాయామం తప్పనిసరి

కొంత మంది మధ్యాహ్నం సమయంలో ఎక్కువగా నిద్రపోతుంటారు. అయితే మధ్యాహ్నం కనీసం 10 నుంచి 20 నిమిషాలు మాత్రమే కునుకు తీస్తే, రాత్రి త్వరగా నిద్రపడుతుంది.

మధ్యాహ్నం కునుకు