రంజాన్ స్పెషల్.. టేస్టీ చికెన్ నగ్గెట్స్ తయారు చేసే విధానం ఇదే!
Samatha
10 march 2026
రంజాన్, ఇఫ్తార్ విందు కోసం చాలా టేస్టీగా, బంగారు రంగులో ఉండే క్రిస్పీ చికెన్ నగ్గెట్స్ ఇంట్లో ఎలా తయారు చేయాలో చూద్దాం.
చికెన్ నగ్గేట్స్
కావాల్సిన పదార్థాలు : బోన్‌లెస్ చికెన్,కప్పు బ్రెడ్ క్రంబ్స్, వెల్లు్లి నల్ల మిరియాలు, మైదా పిండి, ఎగ్, ఉప్పు, కారం పొడి, నూనె.
కావాల్సిన పదార్థాలు
తయారీ విధానం. ముందుగా ఒక బౌల్ తీసుకొని, అందులో చికెన్ ముక్కలు వేసి మంచిగా శుభ్రం చేసుకోవాలి. అందులో నీరు లేకుండా చూసుకోవాలి.
తయారీ విధానం
తర్వాత అందులో ఉప్పు, నల్ల మిరియాల పొడి, వెల్లుల్లి, మసాలా దినుసులు వేసి మంచిగా, ముక్కకు పట్టేలా కలుపుకోని, మిక్సీ పట్టుకోవాలి.
మిక్సీ
తర్వాత ఇందులో నుంచి చిన్న ముక్కలు తీసుకొని, వాటిని మీకు నచ్చే ఆకారంలో , తయారు చేసుకోవాలి.
సరైన ఆకారం
ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని అందులో మైదా పిండి ,మరొక బౌల్‌లో కోడి గుడ్డు, ఇంకో బౌల్‌లో బ్రెడ్ ముక్కలను తీసుకోవాలి.
అన్ని కలపడం
ఇప్పుడు, మనం మిక్సీ పట్టుకున్న చికెన్ మిశ్రమాన్ని, సరైనా ఆకారంలో తయారు చేసుకొని , ఒకసారి మైదా పిండిలో, మరొకసారి కోడి గుడ్డు మిశ్రమంలో, ఇంకో సారి బ్రెడ్ పౌడర్‌లో అటూ ఇటూ తిప్పాలి.
మిశ్రమాలను పట్టించడం
స్టవ్ ఆన్ చేసి, పాన్ పెట్టి, నూనె వేడి అయిన తర్వాత అందులో వేసి, బంగార రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. అంతే క్రిస్పీ చికెన్ నగ్గేట్స్ రెడీ.