టాలీవుడ్ ఇండస్ట్రీలో అందం, చిలిపితనంతో తనకంటూ మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది. దాదాపు దశాబ్దానికి పైగా సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తుంది రాశీ ఖన్నా.
2014లో ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ఢిల్లీ బ్యూటీ.. మొదటి సినిమాతోనే ప్రేక్షకులను దృష్టిని ఆకట్టుకుని ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
తెలుగులో బెంగాల్ టైగర్, సుప్రీం, తొలిప్రేమ, ప్రతిరోజు పండగే, వెంకీమామ వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. తెలుగులో స్టార్ హీరోల సరసన నటించింది ఈ ముద్దుగుమ్మ.
దశాబ్దంకు పైగా సినీరంగంలో కొనసాగుతున్న ఈ అమ్మడు.. తెలుగు, తమిళం, హిందీ భాషలలో వరుస సినిమాలు చేస్తుంది. కానీ ఇప్పటివరకు సరైన బ్రేక్ రాలేదు.
తాజాగా ఈ అమ్మడు క్రేజీ ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో ఛాన్స్ కొట్టేసిందట.
పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రాశీ ఖన్నా కీలకపాత్రలో కనిపించనుందని టాక్. ఇదివరకే ఈ మూవీ కోసం డైరెక్టర్ రాశీ ఖన్నాను సంప్రదించినట్లు టాక్.
త్వరలోనే ఈ మూవీపై అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉందని టాక్. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, శ్రీలీల నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో నటిస్తుంది రాశీ ఖన్నా.
మరోవైపు పాన్ ఇండియా ప్రాజెక్టులో ఛాన్స్ రావడంతో .. ఇప్పటికైనా తెలుగులో ఈ బ్యూటీ క్రేజ్ మారడం ఖాయమని తెలుస్తోంది. అటు నెట్టింట ఈ ముద్దుగుమ్మ చాలా యాక్టివ్.