AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అబ్బ.. చెరుకు రసం తాగుతున్నారా..? ఓర్నాయనో ఈ విషయాలను తెలుసుకోండి..

వేసవి కాలం ప్రారంభమైంది. ఎండలు బాగా దంచి కొడుతున్నాయి. ఈ అధిక ఉష్ణోగ్రతల వల్ల శరీరం అలసిపోయి, డీహైడ్రేషన్ కు గురవుతుంది. దాహార్తిని తీర్చుకోవడానికి, శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి చాలా మంది పండ్ల రసాలు, ఐస్ క్రీమ్‌లు, నిమ్మకాయ సోడా, బాదం పాలు, ద్రాక్ష పండ్ల జ్యూసు వంటివి ఆశ్రయిస్తారు. వేసవిలో చెరుకు రసం ఉపశమనం అందించినప్పటికీ, అధికంగా తాగడం ఆరోగ్యానికి మంచిది కాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అబ్బ.. చెరుకు రసం తాగుతున్నారా..? ఓర్నాయనో ఈ విషయాలను తెలుసుకోండి..
Sugarcane Juice
Shaik Madar Saheb
|

Updated on: Mar 14, 2026 | 11:31 AM

Share

వేసవి కాలం ప్రారంభమైంది. ఎండలు బాగా దంచి కొడుతున్నాయి. ఈ అధిక ఉష్ణోగ్రతల వల్ల శరీరం అలసిపోయి, డీహైడ్రేషన్ కు గురవుతుంది. దాహార్తిని తీర్చుకోవడానికి, శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి చాలా మంది పండ్ల రసాలు, ఐస్ క్రీమ్‌లు, నిమ్మకాయ సోడా, బాదం పాలు, ద్రాక్ష పండ్ల జ్యూసు వంటివి ఆశ్రయిస్తారు. వీటిలో చెరుకు రసం చాలా ప్రజాదరణ పొందిన పానీయం.. ఖర్చు తక్కువ.. లాభాలు ఎక్కువగా ఉంటాయి.. అయితే, చెరుకు రసం తీసుకోవడం విషయంలో జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాస్తవానికి చెరుకు రసం మంచిది.. ఎందుకంటే ఇందులో మెగ్నీషియం, మాంగనీస్, జింక్, ఐరన్, కాల్షియం, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు వంటి ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. ఈ పోషకాలు మన శరీరానికి అవసరమైనవే. కానీ, ఎక్కువగా తాగొద్దు అని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ రసం అధికంగా సేవించడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదని వారి అభిప్రాయం.

చెరుకు రసంతో ఎన్నో ప్రయోజనాలు..

చెరుకు రసం ఎండాకాలంలో శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడంతోపాటు.. చలువ చేస్తుంది. ఇది కాలేయ పనితీరును, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇంకా మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.. రోగనిరోధక శక్తిని పెంచడంతోపాటు.. చర్మ సంరక్షణకు సహాయపడుతుంది.

వైద్య నిపుణుల ప్రకారం.. ఒక గ్లాసు చెరుకు రసంలో సుమారు 250 కేలరీలు, 100 గ్రాముల చక్కెర ఉంటుంది. ఈ అధిక చక్కెర కంటెంట్, కేలరీలు రోజువారీ లేదా అధిక మోతాదులో తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలకు దారితీయవచ్చు. ముఖ్యంగా, దీనివల్ల ఊబకాయం వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని వారు సూచిస్తున్నారు. ఊబకాయం అనేది అనేక ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు మూల కారణం..

అంతేకాకుండా, చెరుకు రసం అధికంగా తాగడం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ సైడ్ ఎఫెక్ట్స్ రోగాలకు దారితీసి, చివరకు ఆసుపత్రుల పాలు కావాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. అప్పుడు వైద్య ఖర్చులు కూడా ఎక్కువ అవుతాయి.

కాబట్టి, వేసవిలో శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడానికి ఏ పానీయాలు మంచివి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలపై సరైన అవగాహన కలిగి ఉండటం చాలా ముఖ్యం. మనకు అందుబాటులో ఉండే వైద్య నిపుణులను సంప్రదించి, వారి సలహాలు పాటించడం ఉత్తమం. ఆరోగ్యానికి ఎప్పుడు ఏమి అవుతుందో తెలియదు కాబట్టి, వేసవిలో శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. వైద్యుల సూచనలను పాటించడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us