అందేంత దూరంలో చందమామ! 54 ఏళ్ల తర్వాత జాబిల్లి యాత్ర
ఈ భూమ్మీద రష్యా, అమెరికా మధ్య ఆధిపత్య పోరు ఏకబిగిన 45 ఏళ్లపాటు సాగింది. రష్యా ఒక మిస్సైల్‌ని కనిపెట్టిందా.. అయితే తామూ కనిపెట్టాల్సిందేనని అమెరికా. రష్యా అణు పరీక్షలు చేసిందా.. అయితే తామూ చేసి తీరాల్సిందే అనేంత కసి అమెరికాకి. రష్యా స్పుత్నిక్‌ను పంపితే.. అమెరికా ఎక్స్‌ప్లోరర్‌ను స్పేస్‌లోకి పంపింది! రష్యా యూరీ గగారిన్‌ను స్పేస్‌లోకి పంపింది. అంతరిక్షంలోకి వెళ్లొచ్చిన మొదటి మానవుడు అతను. రష్యాకు కౌంటర్‌గా ఏం చేయాలి, ఎలా చేయాలి అని ఆలోచిస్తుండంగా.. ఏకంగా చంద్రుడి మీదకే మనిషిని పంపింది అమెరికా. ఆ ఆధిపత్యం ఎంతవరకూ నడిచిందంటే.. సోవియట్ రష్యా కుప్పకూలి, క్రెమ్లిన్ భవనంపై రష్యా జెండా ఎగిరేంత దాకా. ఎప్పుడైతే రష్యా బలహీనపడిందో.. ఇక చంద్రుని గురించి ఆలోచించలేదెవరూ! చందమామను అక్కడే వదిలేసి తన పని తాను చేసుకుంటున్నాడు మానవుడు. అలా 54 ఏళ్లు గడిచిపోయింది. ఇన్నాళ్లకు చంద్రుడు మళ్లీ గుర్తొచ్చాడు నాసాకు. ఆర్టెమిస్ -2 పేరుతో ఓ మిషన్ చేపట్టింది. నెక్ట్స్ ఆర్టిమిస్-3 ఉంటుంది. ఆర్టెమిస్ -4 మిషన్‌తో మరోసారి చంద్రునిపైకి మనిషిని దించుతారు. మనిషి చంద్రుడిపై అడుగుపెట్టాడని పుస్తకాల్లో చదువుకోవడం, ఇంటర్నెట్‌లో వీడియోలు చూడడమే తప్పించి.. ఆ క్షణాలను ఆస్వాదించిందే లేదు. మళ్లీ చంద్రుని మీదకు మనిషి దిగబోతున్న దృశ్యాలను మళ్లీ ఏడాదికైనా చూడబోతున్నాం. ఓ డౌట్. మనిషిని చంద్రుని మీదకు తీసుకెళ్లడానికి ఐదున్నర దశాబ్దాలు ఎందుకు పట్టింది? ఇప్పుడే ఎందుకని ఆ ప్రయోగం చేస్తోంది? ఆర్టెమిస్ మిషన్‌లో టార్గెట్ ఏంటి?

ఆర్టెమిస్ .. ఈ పేరే ఎందుకు పెట్టారు. గ్రీకు పురాణాల ప్రకారం.. ఆర్టిమిస్ అనే దేవత చంద్రుడికి అధిదేవత. సూర్యుడికి అధిదేవత అయిన అపోలోకి కవల సోదరి. నాసా చంద్రుడి మీదకు మనుషులను పంపిన మొదటి ప్రాజెక్టుకు పెట్టిన పేరు ‘అపోలో’నే. సో, అపోలో సోదరి ఆర్టెమిస్ కాబట్టి.. దానికి కొనసాగింపుగా అన్నట్టుగా ఉండాలనే ఈ పేరు. ఇక అసలు విషయం. చంద్రుని మీద కాలుమోపడానికి పెద్ద కసరత్తు అక్కర్లేదు. నాసాకు ఆల్రడీ అనుభవం ఉంది. బట్.. ఈ ఆర్టెమిస్ మిషన్ చంద్రుని దక్షిణ ధ్రువంలో దిగడానికి. మనం రోజూ చూస్తున్న చంద్రుని ముఖం ఉత్తర దిశది. ఆ వెనక దక్షిణాన అంతా చీకటే. అక్కడ ఏముందో, ఎలా ఉంటుందో తెలియదు మనిషికి. బట్.. ఆ దక్షిణ ధ్రువంలో భూకంపాలు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తేలింది. అంతేకాదు.. అక్కడి వాలు ప్రాంతాలు వదులుగా ఉండి, జారిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టు గుర్తించారు. ల్యాండింగ్ సమయంలో స్వల్ప స్థాయిలో భూప్రకంపనలు వచ్చే అవకాశమూ ఉందంటున్నారు. వీటన్నింటికంటే అసలైన సవాలు.. కమ్యూనికేషన్. చంద్రుని వెనక నుంచి భూమి మీదకు కమ్యూనికేట్ చేయడం బిగ్గెస్ట్ ఛాలెంజ్. అందుకే.. ఆర్టెమిస్ మిషన్‌లో నాలుగు దశల్లో ప్రయోగాలు చేస్తున్నారు. 1972.. మనిషి చివరిసారిగా చంద్రుడిపై తన పాదముద్రను వదిలి వచ్చాడు. ఆ తర్వాత అంతా నిశ్శబ్దం. ఐదు దశాబ్దాల పాటు జాబిల్లి కేవలం ఆకాశంలో మెరిసే అద్భుతంగానే మిగిలిపోయింది. కానీ ఇప్పుడు.....
