AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

150 కంటే ఎక్కువ మంది స్టాఫ్ ఉంటే సైన్యంలోకి పంపాల్సిందే..! కంపెనీలకు ఆ దేశం సరికొత్త రూల్..

ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో భారీగా సైనికులను కోల్పోయిన పుతిన్ సర్కార్.. ఉద్యోగులను సైన్యంలోకి తీసుకోవాలని నిర్ణయించింది. ఆఫీసుల్లో ఫైళ్లు తిరగేసే ఉద్యోగుల చేతికి ఇప్పుడు గన్ ఇచ్చి సరిహద్దులకు పంపుతున్నారు. అయితే.. ఆర్మీలోకి ప్రైవేట్ సైన్యం విషయం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది..

150 కంటే ఎక్కువ మంది స్టాఫ్ ఉంటే సైన్యంలోకి పంపాల్సిందే..! కంపెనీలకు ఆ దేశం సరికొత్త రూల్..
Russia Employees in Military
Shaik Madar Saheb
|

Updated on: Apr 05, 2026 | 9:31 AM

Share

ఉక్రెయిన్‌తో నాలుగేండ్లుగా సాగుతున్న యుద్ధంలో 3.5 లక్షల మంది సైనికులను కోల్పోవడం రష్యాకు భారీ నష్టాన్ని మిగిల్చింది. దీంతో సైన్యం కోసం రహస్య నియామకాలకు రష్యన్‌ కంపెనీలు కేంద్రంగా మారాయి. కాంట్రాక్ట్‌ సైనిక సేవ కోసం అభ్యర్థుల జాబితాలను రూపొందించే ప్రక్రియలో 150 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న సంస్థలను రష్యా అన్వేషించడం ప్రారంభించింది. ర్యాజాన్‌ ప్రాంతంలో ప్రైవేట్‌, ప్రభుత్వ యాజమాన్యంలోని కంపెనీలు ఉద్యోగులను నామినేట్‌ చేయాలని ఆదేశిస్తూ అక్కడి గవర్నర్‌ పావెల్‌ మల్కోవ్‌ ఒక ఉత్తర్వుపై సంతకం చేశారు. ఈ ఉత్తర్వు ప్రకారం అవసరమైన అభ్యర్థుల సంఖ్య కంపెనీ పరిమాణంపై ఆధారపడి ఉంటుంది.

150 నుండి 300 మంది ఉద్యోగులు ఉన్న కంపెనీలు కనీసం ఇద్దరు అభ్యర్థులను, 300 నుండి 500 మంది ఉన్న కంపెనీలు ముగ్గురు అభ్యర్థులను, 500 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న కంపెనీలు ఐదుగురు అభ్యర్థులను నామినేట్‌ చేయాలని ఆయన ఆదేశించారు. సైనిక సమీకరణ ప్రక్రియను వీలైనంత తొందరగా పూర్తి చేసి, ఎంపిక చేసిన వారిని పోరాటానికి సిద్ధం చేయడానికి రష్యా మిలిటరీ, నేవీ కమాండర్లు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

శిక్షణ పూర్తైన వెంటనే వారిని యుద్ధంలో భాగం చేసే అవకాశం ఉంది. ఈ ఆదేశాలు పాటించని కంపెనీలకు పెద్ద మొత్తంలో జరిమానా విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ప్రియురాలి కోసం పిల్లాడి పిచ్చి సాహసం.. 5ఏళ్లకే బస్సు ఎత్తుకెళ్లి
ప్రియురాలి కోసం పిల్లాడి పిచ్చి సాహసం.. 5ఏళ్లకే బస్సు ఎత్తుకెళ్లి
రూ.7.20 కోట్లు పెట్టినందుకు వడ్డీతో సహా చెల్లించేస్తున్నాడు
రూ.7.20 కోట్లు పెట్టినందుకు వడ్డీతో సహా చెల్లించేస్తున్నాడు
150 కంటే ఎక్కువ మంది స్టాఫ్ ఉంటే సైన్యంలోకి పంపాల్సిందే!
150 కంటే ఎక్కువ మంది స్టాఫ్ ఉంటే సైన్యంలోకి పంపాల్సిందే!
ఎన్టీఆర్‌కు ఇష్టమైన కారు ఇప్పుడు ఎక్కడుందో తెలుసా.?
ఎన్టీఆర్‌కు ఇష్టమైన కారు ఇప్పుడు ఎక్కడుందో తెలుసా.?
వెండిపై లోన్.. ఈ విషయాలు తెలుసుకోకపోతే మీరు నష్టపోవడం పక్కా..
వెండిపై లోన్.. ఈ విషయాలు తెలుసుకోకపోతే మీరు నష్టపోవడం పక్కా..
హద్దులు చెరిపేస్తున్న యంగ్ హీరోలు
హద్దులు చెరిపేస్తున్న యంగ్ హీరోలు
సొమ్మసిల్లిన విషసర్పానికి సపర్యలు.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా
సొమ్మసిల్లిన విషసర్పానికి సపర్యలు.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా
వేసవిలో బెస్ట్ హెల్తీ డ్రింక్.. రాగి పాలు.. హెల్తీగా, టేస్టీగా..
వేసవిలో బెస్ట్ హెల్తీ డ్రింక్.. రాగి పాలు.. హెల్తీగా, టేస్టీగా..
అరేయ్.. ఏంట్రా ఇదీ.. లవర్‌తో లొల్లి.. టవర్ ఎక్కి ఏం చేశాడంటే?
అరేయ్.. ఏంట్రా ఇదీ.. లవర్‌తో లొల్లి.. టవర్ ఎక్కి ఏం చేశాడంటే?
బాబా వంగా జోస్యం..వచ్చే వారం ఈ 5 రాశుల వారికి కనకవర్షం! విలాసవంతం
బాబా వంగా జోస్యం..వచ్చే వారం ఈ 5 రాశుల వారికి కనకవర్షం! విలాసవంతం