Donald Trump: ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్-అమెరికా యుద్ధానికి సంబంధించి తాజాగా వైట్ హౌస్ ఒక సంచలన ప్రకటన చేసింది. ఇరాన్‌తో యుద్ధం ముగిసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాంగ్రెస్‌కు అధికారికంగా లేఖ రాసినట్టు తెలుస్తోంది. అయితే గత ఏప్రిల్ 7 నుంచి ఇరాన్, అమెరికా మధ్య కాల్పుల విరమణ కొనసాగుతున్న నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఎలాంటి దాడులు జరగలేదని..ఈ క్రమంలోనే ఫిబ్రవరి 28న ప్రారంభమైన యుద్ధం ఇప్పుడు అధికారికంగా ముగిసిందని వైట్ హౌస్ ప్రకటించింది.

ఇరాన్-అమెరికా యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇరాన్‌తో యుద్ధం ముగిసినట్టు ప్రకటించారు. ఈ మేరకు ఆయన అమెరికా చట్టసభ సభ్యులకు శుక్రవారం ఒక లేఖ ద్వారా సమాచారాన్ని పంపారు. యుద్ధాన్ని కొనసాగించడానికి కాంగ్రెస్ అనుమతి తప్పనిసరి అనే వివాదానికి స్వస్తి పలకడమే ఈ ప్రకటన వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని నివేదికలు రాసుకొచ్చాయి.
అమెరికా చట్టాల ప్రకారం.. కాంగ్రెస్ ఆమోదం లేకుండా సైనిక చర్యలు చేపట్టినప్పుడు, 60 రోజుల గడువు లోపు ఆ ఆపరేషన్లను నిలిపివేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇరాన్‌తో యుద్ధం ప్రారంభించి 60 రోజులు ముగుస్తుండడంతో వైట్ హౌస్ ఒక వినూత్న చట్టపరమైన వాదనను తెరపైకి తెచ్చింది. ఇరాన్‌తో కాల్పుల విరమణ కుదిరినందున, యుద్ధం ముగిసినట్లేనని, కాబట్టి ఆ 60 రోజుల నిబంధన ఇక వర్తించదని ట్రంప్ ప్రభుత్వం పేర్కొంది.
అమెరికా-ఇరాన్ మధ్య ఏప్రిల్ 7నే కాల్పుల విరమణ ఒప్పందాలు జరిగాయని.. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య ఎలాంటి కాల్పులు జరగలేదని ట్రంప్ తెలిపారు. అందుకే ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఈ ఘర్షణలు ఇప్పుడు ముగిశాయని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. అయితే, యుద్ధం ముగిసిందని చెబుతున్నప్పటికీ స్టైట్ ఆఫ్ హర్మూజ్ వద్ద అమెరికా సైనిక దిగ్బంధనం ఇంకా కొనసాగుతూనే ఉన్నట్టు తెలుస్తోంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
