AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ ఒక్క మాటతో.. ఆ మేనేజర్‌ లేచి వెళ్లిపోయాడు !

ఆ ఒక్క మాటతో.. ఆ మేనేజర్‌ లేచి వెళ్లిపోయాడు !

Phani CH
|

Updated on: May 21, 2026 | 4:24 PM

Share

బెంగళూరు ఎయిర్‌పోర్టులో 16 ఏళ్ల తర్వాత కలిసిన మాజీ మేనేజర్‌ను ఓ వ్యక్తి ‘నా రిలీవింగ్ లెటర్ సంగతి ఏంటి?’ అని అడగడంతో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. వెంటనే అక్కడి నుంచి నిశ్శబ్దంగా వెళ్లిపోయిన మేనేజర్ రియాక్షన్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉద్యోగ సంబంధాల్లో బాధ్యత ఎంత ముఖ్యమో ఈ సంఘటన మరోసారి గుర్తుచేస్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఓ వ్యక్తి బెంగళూర్‌ ఎయిర్‌పోర్టులో విమానం కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ సమయంలో దూరంగా కూర్చొన్న ఓ వ్యక్తిని చూశాడు. అతడిని ఎక్కడో చూసినట్లు అనిపించి.. లేచి అతని వద్దకు వెళ్లాడు. జాగ్రత్తగా పరిశీలించాక.. 18 ఏళ్ల కిందట తాను ఉద్యోగంలో చేరిన కొత్తల్లో ఆయన తనకు మేనేజర్‌గా పనిచేశాడని గుర్తుపట్టాడు. అంతే సంతోషం పట్టలేక అతనితో మాటలు కలిపాడు. ఆ మాజీ మేనేజర్‌ కూడా అతన్ని గుర్తు పట్టి పాత ఆఫీసు కబుర్లలో మునిగిపోయాడు. ఈ క్రమంలో ఆ వ్యక్తి ఆ పెద్దాయనను ఓ ప్రశ్న అడిగాడు. అంతే.. అతని ముఖంలో నవ్వు మాయమైంది. సైలెంట్‌గా జేబుల్లో చేతులు పెట్టుకుని వెనక్కి తిరిగి చూడకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ పరిణామంతో చిన్నగా నవ్వుకున్న ఆ వ్యక్తి.. సోషల్‌మీడియాలో ఆ ప్రశ్నేంటో చెబుతూ ఇలా రాసుకొచ్చాడు. 2008లో ఒక మల్టీ నేషనల్‌ కంపెనీలో ఎలక్ట్రికల్ ఇంజనీర్‌గా చేరిన ఆ యువకుడు .. రెండు సంవత్సరాలకు ఆ ఉద్యోగం మానేశాడు. ఒకే తీరు పని, ఆఫీస్ ఫేవరిటిజం, ఎడతెరిపి లేని ప్రయాణాలతో అప్పట్లో అతడు బాగా సతమతమయ్యాడు. అదే సమయంలో అతడికి సైంటిస్ట్‌గా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. పాత సంస్థకు రాజీనామా చేసి రిలీవ్ అయ్యే క్రమంలో సదరు కంపెనీ హెచ్‌ఆర్‌.. నిజాయితీగా ఫీడ్‌బ్యాక్‌ ఇవ్వమని సదరు వ్యక్తిని అడిగాడు. అంతే.. అతడు ఉన్నది ఉన్నట్లుగా తన ఫీడ్ బ్యాక్ ఫామ్‌లో రాసి ఇచ్చేశాడు. అది చూసిన సదరు సంస్థ.. మూడు నెలల నోటీసు పీరియడ్‌ కూడా అక్కర్లేకుండా వెంటనే అతడిని రిలీవ్ చేసేసింది. కానీ అతనికి రిలీవింగ్‌ లెటర్‌ మాత్రం ఇవ్వలేదు. దీంతో సదరు ఉద్యోగి.. తన మేనేజర్‌ను కలిసి లెటర్ గురించి అడగగా.. సదరు మేనేజర్ ‘చూద్దాం.. చేద్దాం అంటూ కాలం గడిపాడు. చివరకు ఆ లెటర్ సంగతి గురించి మాట్లాడటమే మానేశాడు. దీంతో విసుగెత్తిపోయిన ఆ యువకుడు దాని సంగతి మర్చిపోయి కొత్త ఉద్యోగంలో చేరిపోయాడు. కట్‌ చేస్తే.. 16 ఏళ్ల తర్వాత కలిసి ఆ మాజీ మేనేజర్‌ను ఆ వ్యక్తి అడిగిన ప్రశ్న.. ‘నా రిలీవింగ్‌ లెటర్‌ సంగతి ఏంటి?’ అని. అందుకే ఆయనగారూ గప్‌చుప్‌గా వెళ్లిపోయారట. రిటైర్‌ మెంట్‌కు చేరువయ్యే అంత సీనియర్ వ్యక్తి కూడా తన ప్రశ్నకు ఇప్పటికీ గిల్టీగా ఫీలై వెళ్లిపోవడం చూసి ఆశ్చర్యపోయాననీ రాసుకొచ్చాడు. ఈ సంఘటన రెడ్డిట్‌లో “My Ex-Manager Remembered Everything Except Accountability” అనే శీర్షికతో పోస్ట్‌ అయ్యి వెంటనే వైరల్‌ అయింది.దీంతో ఆ ఫీడ్‌బ్యాక్‌లో మేనేజర్‌ గురించి ఏమైనా చెప్పి ఉంటాడా? అనే కుతూహలం రెడ్డిట్‌ యూజర్లలో పెరిగి ఆరాలు తీస్తున్నారు. చాలామంది కామెంట్స్‌లో, మేనేజర్‌ రియాక్షన్‌ గిల్టీ ఫీలింగ్ వల్లేనని చెప్పారు. కొందరు “ఉద్యోగి ముందుకు వెళ్లిపోయాడు, కానీ మేనేజర్ మాత్రం ఆ పాత తప్పును ఇప్పటికీ మరిచిపోలేదు” అని వ్యాఖ్యానించారు. మరికొందరు రిలీవింగ్ లెటర్స్‌, మేనేజీరియల్‌ ఈగో వంటి సమస్యలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని గుర్తు చేశారు. ఉద్యోగ సంబంధాల్లో బాధ్యత చాలా ముఖ్యం. ఒక చిన్న నిర్లక్ష్యం కూడా సంవత్సరాల తర్వాత కూడా అసౌకర్యం కలిగిస్తుంది.. ఈ ఉద్యోగి వైరల్‌ కథలోలాగా!

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కొమ్ముతో ఏకంగా జీపును ఎత్తిపడేసింది! భయంతో కేకలు వేసిన టూరిస్ట్‌లు.. చివరకు..

10 నిమిషాల డెలివరీ కంటే ప్రశాంతతే ముఖ్యం! బ్యాంకాక్‌లో భారత మహిళ పోస్ట్ వైరల్

కరెంట్ లేకుండానే కూలింగ్! ఇక ఏసీతో పనిలేదు

వామ్మో… ఆ ఊరి నిండా పాములే! ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న గ్రామం

Aadhaar Update: ఆధార్ అప్డేట్‌‌పై కేంద్రం గుడ్‌ న్యూస్‌

Follow Us