AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వామ్మో... ఆ ఊరి నిండా పాములే! ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న గ్రామం

వామ్మో… ఆ ఊరి నిండా పాములే! ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న గ్రామం

Phani CH
|

Updated on: May 21, 2026 | 4:05 PM

Share

మహారాష్ట్రలోని షేట్‌ఫల్ గ్రామంలో నాగుపాములు ఇళ్లలో స్వేచ్ఛగా సంచరిస్తూ ఉండటం ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. ప్రతి ఇంట్లో పాముల కోసం ప్రత్యేక స్థలం ఏర్పాటు చేసే గ్రామస్థులు వాటిని దైవస్వరూపాలుగా భావిస్తారు. నాగపంచమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మనుషులు, విషసర్పాల మధ్య సహజీవనానికి ఈ గ్రామం అరుదైన ఉదాహరణగా నిలుస్తోంది.

మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా షేట్‌ఫల్ గ్రామం గురించి వింటే ఒళ్లు జలదరిస్తుంది. పాము అంటేనే ఆమడ దూరం పరుగెత్తే ఎవరికైనా, అత్యంత ప్రమాదకరమైన నాగుపాములతో ఆ గ్రామ ప్రజలకు విడదీయలేని బంధం ఉందని తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఆ ఊరిలో మరో వింత ఏమిటంటే, ప్రతి ఇంట్లో ‘దేవస్థానం’ పేరుతో పాములు విశ్రాంతి తీసుకోవడానికి ఒక ప్రత్యేకమైన స్థలాన్ని నిర్మిస్తారు. పాములు కేవలం బయట తిరగడమే కాకుండా, స్వేచ్ఛగా ఇళ్లలోకి, బడుల్లోకి, గుడిలోకి వస్తూ పోతూ ఉంటాయి. వాటిని ఎవరూ బంధించరు. అలాగే పెంపుడు జంతువుల్లా చూడరు. కేవలం దైవస్వరూపాలుగా భావించి గౌరవిస్తారు. విషసర్పాలతో కలిసి ఉంటున్నా, అక్కడ పాముకాటు వల్ల ప్రాణాలు కోల్పోయిన ఘటనలు దాదాపు లేవని గ్రామస్థులు చెబుతుంటారు. మనుషులు, పాముల మధ్య ఉన్న పరస్పర గౌరవమే దీనికి కారణమని వారు నమ్ముతారు. అక్కడ పిల్లలు సాధు జంతవుల్లా మారిపోయిన నాగుపాములతో ఆడుకోవడం అక్కడికి వచ్చే పర్యాటకులకు ఒక అద్భుతంలా అనిపిస్తుంది. షేట్‌ఫల్ గ్రామంలో ఎక్కువగా కనిపించేవి నాగుపాములు. వీటితో పాటు జెర్రిపోతులు, కట్లపాములు, పచ్చపాములు, నీటి పాములు. అప్పుడప్పుడు కొండచిలువలు కూడా దర్శనమిస్తుంటాయి. ఈ గ్రామం పూణె అంతర్జాతీయ విమానాశ్రయానికి సోలాపూర్ రైల్వే స్టేషన్ కి దగ్గర్లో ఉంటుంది. అక్కడ్నుంచి ట్యాక్సీలో వెళ్లవచ్చు. ఈ గ్రామం పూణే నుంచి సుమారు 200 కి.మీ. దూరంలో ఉంటుంది. షేట్‌ఫల్ లో ఈ సంప్రదాయం శతాబ్దాల నాటిది. హిందూ మతంతో లోతుగా ముడిపడి ఉంది. పాములను శివునికి చిహ్నంగా భావిస్తారు. ఆ గ్రామంలో నాగ పంచమి నాడు ఒక ప్రత్యేక పండుగ జరుగుతుంది. అక్కడ పాములను పూజిస్తారు. ప్రజలు పాలు, గుడ్లు, ప్రసాదం సమర్పించి ఆశీర్వాదం కోరుకుంటారు. అంతేకాదు ఆ గ్రామంలో పాములను పట్టుకోవడం నిషేధం. పాములు పూర్తిగా స్వేచ్ఛగా తమకు నచ్చిన విధంగా తిరుగుతాయి. ఈ సంప్రదాయం ఆధ్యాత్మికమైనది. పాములను బోనుల్లో ఉంచే బదులు ప్రజలు వాటిని తమ ఇళ్లలో అతిథులుగా స్వాగతిస్తారు. ఈ స్వేచ్ఛ పాములు, మానవుల మధ్య సంబంధాన్ని బలపరిచేలా ఉంటుంది. షేట్‌ఫల్ గ్రామం వన్యప్రాణుల సంరక్షణకు ఒక ప్రత్యేక ఉదాహరణ. ఎటువంటి రక్షణ లేకుండా, ప్రకృతి ఒడిలో గ్రామస్తులు కోబ్రా పాముల వంటి ప్రమాదకరమైన జీవులతో సహజీవనం చేస్తున్నారు. ఇది అటవీ జంతువులకి, మానవుల మధ్య సమతుల్యతకు చిహ్నం.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Aadhaar Update: ఆధార్ అప్డేట్‌‌పై కేంద్రం గుడ్‌ న్యూస్‌

భీమేశ్వరాలయ సమీపంలో అరుదైన శ్వేతనాగు.. ప్రత్యక్షం

కుక్కను వెంబడిస్తూ వెళితే.. బయటపడిన 18 వేల ఏళ్ల రహస్య ప్రపంచం

Follow Us