ఆ హీరో అంటే చాలా ఇష్టం.. ఎప్పటికీ అతడు నాకు స్పెషల్.. అనుష్క..
Rajitha Chanti
Pic credit - Instagram
21 May 2026
టాలీవుడ్ 'జెజమ్మ'గా, లేడీ సూపర్ స్టార్‌గా కోట్లాది మంది అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న హీరోయిన్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు అనుష్క శెట్టి.
ఎంత ఎదిగినా తన మూలాలను, తనకు సినీ జీవితాన్ని ప్రసాదించిన వారిని ఎప్పుడూ మర్చిపోరు. ఒక ఇంటర్వ్యూలో మొదటి సినిమా ఆడిషన్స్ జ్ఞాపకాలను పంచుకున్నారు.
నాగార్జున టాలీవుడ్‌లో తన అత్యంత ఇష్టమైన హీరో మాత్రమే కాదు, తన జీవితంలో ఒక 'గాడ్ ఫాదర్' అని.. తన జీవితంలో చాలా స్పెషల్ అని చెప్పుకొచ్చింది.
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా నటించిన 'సూపర్' (Super) సినిమాతో అనుష్క తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఓవర్ నైట్ స్టార్ అయ్యింది.
అయితే ఆ సినిమా ఆడిషన్స్ సమయానికి తనకు సినిమా ఇండస్ట్రీ గురించి, ఫోటోషూట్‌ల గురించి కనీస అవగాహన కూడా లేదని అనుష్క తెలిపారు.
నేను ఆడిషన్‌కి వెళ్లినప్పుడు నాగార్జున గారు 'మాస్' సినిమా షూటింగ్ చేస్తున్నారు. అదొక ఆడిషన్ అని కూడా నాకు తెలియదు, సినిమా చేయమని పిలిచారనే వెళ్లాను.
అక్కడ నాకంటే ముందు మిస్ ఇండియా పోటీదారు పర్మీత్ ఠక్కర్ కూడా ఉంది. ఆమెకు మేకప్, కెమెరా యాంగిల్స్ గురించి అన్నీ తెలుసు. నాకేమో పాస్‌పోర్ట్ ఫోటో దిగాలన్నా భయం.
సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా, ఎలాంటి అవగాహన లేకపోయినా నాగార్జున, పూరి తన అమాయకత్వాన్ని అర్థం చేసుకుని సినిమా రంగానికి పరిచయం చేశారని అన్నారు.