AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IRCTC టూర్ ప్యాకేజ్: వీసా లేకుండానే రైలులో నేపాల్ ట్రిప్.. 10 రోజుల సూపర్ జర్నీ!

Indian Railway Catering and Tourism Corporation జూన్ 12న నేపాల్‌కు ప్రత్యేక “భారత్ గౌరవ్” పర్యాటక రైలును ప్రారంభిస్తోంది. “పశుపతినాథ్ నేపాల్ దర్శన్ యాత్ర” పేరుతో నడిచే ఈ రైలు భారత సరిహద్దులు దాటి ప్రయాణించే తొలి భారత్ గౌరవ్ రైలు కానుంది. ఇది పర్యాటకులు, యాత్రికులకు ప్రత్యేక అవకాశంగా నిలవనుంది.

IRCTC టూర్ ప్యాకేజ్: వీసా లేకుండానే రైలులో నేపాల్ ట్రిప్.. 10 రోజుల సూపర్ జర్నీ!
Irctc Nepal Tour By Train 2026
Rajashekher G
|

Updated on: May 21, 2026 | 10:23 PM

Share

IRCTC Nepal Tour Package: భారతీయ రైల్వే చరిత్రలో మరో విశిష్ట ఘట్టానికి తెరలేచింది. పర్యాటక రంగాన్ని ప్రోత్సహిస్తూ ప్రారంభించిన ‘భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్’ తొలిసారిగా అంతర్జాతీయ సరిహద్దు దాటి నేపాల్‌కు ప్రయాణించనుంది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రత్యేక యాత్రను ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) నిర్వహిస్తోంది. జూన్ 12న ప్రారంభమయ్యే ఈ ఆధ్యాత్మిక–పర్యాటక యాత్రకు ‘పశుపతినాథ్ నేపాల్ దర్శన్ యాత్ర’ అని పేరు పెట్టారు.

ఇది భారతదేశ సరిహద్దులను దాటి ప్రయాణించే తొలి భారత్ గౌరవ్ రైలు కావడం ప్రత్యేకత. యాత్రికులు, పర్యాటకుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ ప్యాకేజీలో రైలు ప్రయాణం నుంచి వసతి, భోజనం, స్థానిక దర్శనాలు వరకు అన్నీ ఒకే చోట అందుబాటులో ఉంటాయి. సురక్షితంగా, సౌకర్యవంతంగా నేపాల్ పర్యటన చేయాలనుకునేవారికి ఇది అరుదైన అవకాశం అని IRCTC తెలిపింది.

10 రోజుల ప్రత్యేక నేపాల్ యాత్ర

ఈ యాత్ర మొత్తం 9 రాత్రులు – 10 రోజులపాటు కొనసాగుతుంది. నేపాల్‌లోని ప్రసిద్ధ ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాలను ఇందులో చేర్చారు. కాఠ్మండు, పశుపతినాథ్ ఆలయం, పోఖారా, చిత్వాన్ నేషనల్ పార్క్, మనకామన ఆలయం వంటి ప్రముఖ ప్రదేశాలను సందర్శించే అవకాశం ఉంటుంది.

యాత్రలో ప్రధాన ఆకర్షణలు

  • కాఠ్మండు – నేపాల్ రాజధానిలోని చారిత్రక, సాంస్కృతిక వైభవాన్ని ఆస్వాదించే అవకాశం
  • పశుపతినాథ్ ఆలయం – ప్రపంచ ప్రసిద్ధ శివక్షేత్ర దర్శనం
  • పోఖారా – హిమాలయాల నడుమ అందమైన సరస్సుల నగరం
  • చిత్వాన్ నేషనల్ పార్క్ – జీప్ సఫారీ ద్వారా వన్యప్రాణుల సందర్శనం
  • మనకామన ఆలయం – రోప్‌వే ప్రయాణంతో కొండపై ఉన్న ప్రసిద్ధ ఆలయ దర్శనం

ఎక్కడెక్కడి నుంచి రైలు ఎక్కొచ్చు?

ఈ ప్రత్యేక రైలు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌తో పాటు ఉజ్జయిన్, షుజల్పూర్, భోపాల్, ఇటార్సీ, నర్సింగ్‌పూర్, జబల్‌పూర్, కట్నీ, సత్నా రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది.

రైలు ప్రత్యేకతలు

డీలక్స్ ఏసీ టూరిస్ట్ రైలుగా రూపొందించిన ఈ ట్రైన్‌లో మొత్తం 14 కోచ్‌లు ఉంటాయి. ప్రయాణికుల సౌకర్యార్థం ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ కేటగిరీలలో టికెట్లు అందుబాటులో ఉంచారు.

ప్యాకేజీ ధరలు

  • థర్డ్ ఏసీ కంఫర్ట్ – రూ. 62,710
  • సెకండ్ ఏసీ డీలక్స్ – రూ. 76,550
  • ఫస్ట్ ఏసీ సుపీరియర్ – రూ. 90,400

ప్యాకేజీలో ఏమేమి ఉంటాయి?

ఈ ధరల్లో కేవలం రైలు టికెట్ మాత్రమే కాదు, యాత్రకు సంబంధించిన దాదాపు అన్ని ప్రధాన సౌకర్యాలు చేర్చబడ్డాయి.

  • నేపాల్‌లో త్రీ-స్టార్ హోటళ్లలో వసతి
  • భోజన సదుపాయం
  • ఏసీ బస్సుల ద్వారా స్థానిక ప్రయాణం
  • ట్రావెల్ ఇన్సూరెన్స్
  • ప్రత్యేక టూర్ గైడ్ సేవలు

ఆధ్యాత్మికత, ప్రకృతి సౌందర్యం, సాహస యాత్ర — ఈ మూడు అనుభూతులను ఒకేసారి అందించే ఈ ‘పశుపతినాథ్ నేపాల్ దర్శన్ యాత్ర’ పర్యాటకులకు ఒక మరిచిపోలేని అనుభవంగా నిలవనుంది.

Follow Us
సమస్య పరిష్కారానికి వినూత్న నిరసన.. ఏం చేశారో చూడండి
సమస్య పరిష్కారానికి వినూత్న నిరసన.. ఏం చేశారో చూడండి
శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు..
శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు..
మతిపోగోడుతున్న మహేష్ మేనకోడలు.. జాన్వీ లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
మతిపోగోడుతున్న మహేష్ మేనకోడలు.. జాన్వీ లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
వేసిన కాసేపటికే ఆరిపోతున్న వీధి లైట్‌లు.. ఎన్ని సార్లు వేసినా..
వేసిన కాసేపటికే ఆరిపోతున్న వీధి లైట్‌లు.. ఎన్ని సార్లు వేసినా..
శుక్రుడి గ్రహ మార్పు.. ఇక లగ్జరీ జీవితం మీ సొంతం!
శుక్రుడి గ్రహ మార్పు.. ఇక లగ్జరీ జీవితం మీ సొంతం!
రామ్ చరణ్ నాకు పెద్దన్నయ్య అయితే మంచి ఫ్రెండ్ మాత్రం ఆ హీరోనే
రామ్ చరణ్ నాకు పెద్దన్నయ్య అయితే మంచి ఫ్రెండ్ మాత్రం ఆ హీరోనే
ఇంట్లో టికెట్ మర్చిపోయినా ట్రైన్లో ప్రయాణించవచ్చు.. ఎలా అంటే..?
ఇంట్లో టికెట్ మర్చిపోయినా ట్రైన్లో ప్రయాణించవచ్చు.. ఎలా అంటే..?
తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే దాహం దాహం
తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే దాహం దాహం
గ్యాస్ ట్రబుల్, ఎసిడిటీ ఉన్నవాళ్లు కూడా హ్యాపీగా తినే పకోడీ
గ్యాస్ ట్రబుల్, ఎసిడిటీ ఉన్నవాళ్లు కూడా హ్యాపీగా తినే పకోడీ
సిగరెట్ అలవాటు మానేయడం కష్టమా? చాలా మంది ఎందుకు ఫెయిల్‌ అవుతారంటే
సిగరెట్ అలవాటు మానేయడం కష్టమా? చాలా మంది ఎందుకు ఫెయిల్‌ అవుతారంటే