AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రోజుకు ఎన్ని ఉడకబెట్టిన గుడ్లు తినాలి? అందరూ చేసే తప్పులు ఇవే..

సండే అయినా.. మండే అయినా.. రోజూ గుడ్లు తినాలి.. అని డాక్టర్లు చెప్పడం వినే ఉంటారు. అయితే కోట్ల మంది రోజూ కోడిగుడ్లను తింటున్నప్పటికీ, వాటి గురించి ఎన్నో సందేహాలు ఉంటాయి. అస్సలు గుడ్డు శాకాహారమా లేదా మాంసాహారమా? జలుబు, దగ్గు ఉన్నప్పుడు గుడ్డు తినవచ్చా? రోజుకు ఎన్ని గుడ్లు తింటే మంచిది? ఇలాంటి పలు ఆసక్తికర ప్రశ్నలకు ప్రముఖ న్యూట్రిషన్ నిపుణురాలు డాక్టర్ దీప్తి ఖటూజా ఏం చెప్పారో తెలుసుకుందాం..

Krishna S
|

Updated on: Aug 02, 2026 | 7:48 AM

Share
కోడిగుడ్డు నిజంగా శాకాహారమేనా: గుడ్డు శాకాహారమా కాదా అనే వివాదం చాలా కాలంగా నడుస్తోంది. శాస్త్రీయ కోణంలో చూస్తే.. ప్రస్తుతం మార్కెట్‌లో లభించే గుడ్లు అన్‌ఫెర్టిలైజ్డ్ అంటే ఫలదీకరణ చెందనివి. వీటి నుండి పిల్లలు వచ్చే అవకాశం ఎంతమాత్రం ఉండదు. అందుకే చాలామంది వీటిని ఎగ్గెటేరియన్‌గా పరిగణిస్తారు. అయితే ఇవి జంతువుల నుండి వస్తాయి కాబట్టి కొందరు మాంసాహారంగా భావిస్తారు. కాబట్టి దీనిని ఆహారంగా తీసుకోవడం అనేది పూర్తిగా వ్యక్తిగత నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది.

1 / 6
జలుబు, దగ్గు ఉన్నప్పుడు గుడ్డు తినవచ్చా: జలుబు లేదా దగ్గు ఉన్నప్పుడు గుడ్డు తింటే కఫం పెరుగుతుందనే ప్రచారం ఒక అపోహ మాత్రమేనని డాక్టర్ దీప్తి స్పష్టం చేస్తున్నారు. గుడ్డు అలర్జీ లేనివారు జలుబు, స్వల్ప జ్వరం ఉన్న సమయంలో ఉడకబెట్టిన గుడ్డును ధైర్యంగా తినవచ్చు. గుడ్డులోని ప్రొటీన్లు శరీర నిరోధక శక్తిని పెంచి, త్వరగా కోలుకోవడానికి సహాయపడతాయి. అయితే గొంతు నొప్పిగా ఉన్నప్పుడు మసాలాలు వేసిన ఫ్రై, భుర్జీల కంటే కేవలం సాదా ఉడకబెట్టిన గుడ్డును ఎంచుకోవడం మంచిది.

2 / 6
రోజుకు ఎన్ని గుడ్లు తినడం సురక్షితం: సాధారణ వ్యక్తి రోజుకు 1 నుండి 2 ఉడకబెట్టిన గుడ్లు తినడం మంచిది. అదే రోజూ జిమ్‌కు వెళ్లేవారు లేదా తీవ్రమైన వ్యాయామం చేసేవారు రోజుకు 2 నుండి 4 గుడ్ల వరకు తీసుకోవచ్చు. అయితే అధిక కొలెస్ట్రాల్ లేదా గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు గుడ్డులోని పసుపు భాగాన్ని పరిమితంగా తీసుకోవాలి లేదా వైద్యుల సలహా పాటించాలి. తెల్లటి భాగంలో కేవలం స్వచ్ఛమైన ప్రొటీన్ మాత్రమే ఉంటుంది కాబట్టి ఎలాంటి భయం లేకుండా తినవచ్చు.

3 / 6
గుడ్డు వల్ల లభించే పోషకాలు: కోడిగుడ్డును అత్యుత్తమ నాణ్యత కలిగిన ప్రొటీన్ మూలంగా పరిగణిస్తారు. ఒక గుడ్డు నుండి సుమారు 6.3 గ్రాముల ప్రొటీన్, 77 కేలరీల శక్తి లభిస్తాయి. ఇందులో శరీరానికి అవసరమైన 9 రకాల అమైనో ఆమ్లాలు, విటమిన్ B12, విటమిన్ D, సెలీనియం, ఐరన్, కొలీన్ సమృద్ధిగా ఉంటాయి. గుడ్డులోని ల్యూటిన్, జియాక్సాంతిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు కంటి చూపును మెరుగుపరుస్తాయి. అలాగే ఉదయం అల్పాహారంలో గుడ్డును తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలిగి, బరువు నియంత్రణలో ఉంటుంది.

4 / 6

ఉడకబెట్టే విధానం: గుడ్డును సరైన సమయంలో ఉడకబెట్టడం ముఖ్యం. సాఫ్ట్ బాయిల్ కోసం 6-7 నిమిషాలు, హార్డ్ బాయిల్ కోసం 9-12 నిమిషాలు పడుతుంది. గుడ్డును ఎక్కువ సేపు ఉడకబెడితే పసుపు భాగం చుట్టూ ఆకుపచ్చ బూడిద రంగు పొర ఏర్పడుతుంది. ఇది ఐరన్, సల్ఫర్ చర్య వల్ల ఏర్పడే పొర మాత్రమే, దీనివల్ల హాని ఏమీ ఉండదు. ఇక ఉడకబెట్టిన గుడ్లను పెంకు తీయకుండా ఫ్రిజ్‌లో పెడితే వారం రోజులు సురక్షితంగా ఉంటాయి. పెంకు తీస్తే మాత్రం అదే రోజు తినడం మంచిది.

5 / 6
ఏ సమయంలో తినాలి? ఎవరు దూరంగా ఉండాలి: గుడ్డును ఏ సమయంలోనైనా తినవచ్చు, అయితే ఉదయం పూట బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకోవడం వల్ల రోజంతా కావలసినంత శక్తి లభిస్తుంది. అలాగే సాయంత్రం వ్యాయామం పూర్తయిన తర్వాత కండరాల రికవరీ కోసం ఉడకబెట్టిన గుడ్డు తింటే మంచి ఫలితం ఉంటుంది. అయితే అలర్జీ వచ్చేవారు, తీవ్రమైన డయాబెటిస్, అధిక కొలెస్ట్రాల్ సమస్యలతో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నవారు మాత్రం గుడ్ల వినియోగంపై వైద్యుల సలహా తీసుకోవడం తప్పనిసరి.

6 / 6
Follow Us