AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇండస్ట్రీలో కాస్ట్ కటింగ్.. ఎఫెక్ట్ ఎవరి పైన

ఇండస్ట్రీలో కాస్ట్ కటింగ్.. ఎఫెక్ట్ ఎవరి పైన

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: May 21, 2026 | 5:45 PM

Share

టాలీవుడ్‌లో భారీ బడ్జెట్ సినిమాల ఖర్చులను తగ్గించే దిశగా నిర్మాతలు అడుగులు వేస్తున్నారనే చర్చ జోరుగా సాగుతోంది. ప్రొడక్షన్ ఖర్చులు, విదేశీ షెడ్యూల్స్, లగ్జరీ వ్యయాలపై కోత విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు టికెట్ రేట్ల పెంపుపై ఎగ్జిబిటర్లు, ప్రభుత్వం వైఖరి ఆసక్తికరంగా మారింది. ఈ పరిణామాలు పెద్ద సినిమాల వ్యాపారంపై ఎంత ప్రభావం చూపుతాయో చూడాలి.

సినిమా ఇండస్ట్రీలో కాస్ట్ కట్టింగ్ మొదలైందా..? ఈ వ్యవహారం పెద్ద సినిమాలపై కూడా పడుతుందా..? సినిమా రిలీజ్‌కు ముందే పర్సెంటేజ్ కావాలంటున్న ఎగ్జిబిటర్ల ఆశలు నెరవేరతాయా..? విడుదలకు సిద్ధంగా ఉన్న పెద్ద సినిమాలపై ఈ కాస్ట్ కట్టింగ్ ఎఫెక్ట్ ఎంత పడబోతుంది..? దీనివల్ల స్టార్స్ రెమ్యునరేషన్స్‌లోనూ కోత తప్పదా..? టికెట్ రేట్లు పెరుగుతాయా..? ఈ మొత్తం ఇష్యూను ఎక్స్‌క్లూజివ్‌గా డిస్కస్ చేద్దాం.. ఇటీవల జరుగుతున్న పరిణామాలు చూసి సినిమా ఇండస్ట్రీలో కూడా కాస్ట్ కట్టింగ్ అమలు చేయాలని నిర్మాతలు ఆలోచిస్తున్నారు. ఓవైపు ఏయే విభాగాల్లో ఎక్కువ కట్ చేయొచ్చనే చర్చ జరుగుతుంది. మరోవైపు టికెట్ రేట్ల పెంపుపై ప్రభుత్వం పర్మిషన్ ఇస్తుందా.. ఒకవేళ ఇస్తే ఆ పెరిగిన రేట్లను ప్రేక్షకులు ఆమోదిస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఎగ్జిబిటర్లు కూడా టికెట్ రేట్ల పెంపుపై ప్రస్తుతానికి ఒకే మాట మీదున్నారు. గవర్నమెంట్ అనుమతి ఇచ్చినా.. తాము రేట్లు పెంచమన్నారు. మరి అదే మాట మీద కట్టుబడి ఉంటారా..? లేదంటే ఒకవేళ రేట్లు పెరిగితే అందులో ఎక్కువ రెంట్ అడుగుతారా..? అనేది చూడాలి. ఏం జరిగినా కూడా ముందు ఈ వ్యవహారంలో ఎక్కువ ప్రభావితమయ్యేది ‘పెద్ది’ సినిమానే. వందల కోట్లకు చేరిపోతున్న బడ్జెట్‌ని కంట్రోల్ చేయడం అంత ఈజీ కాదు. అందుకే ఖర్చులు తగ్గించుకునే క్రమంలో ముందు ప్రొడక్షన్ కాస్ట్ మీద ఫోకస్ చేస్తున్నారు నిర్మాతలు. ఫారెన్ షెడ్యూల్స్, లగ్జరీస్ వీలైనంత వరకు తగ్గించుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. బడ్జెట్‌లో ఏ మేరకు ఈ కట్టింగ్స్ ఉండాలనేది ప్రస్తుతం నిర్మాతలపై అతిపెద్ద టాస్క్. ఇప్పటికే షూటింగ్ అయిపోయిన సినిమాలకు ఏం చేయలేరు కానీ.. సెట్స్‌పైకి రాబోయే భారీ సినిమాలకు ఈ నియమాలు కచ్చితంగా అమలు చేసే విధంగా నిర్మాతల అడుగులు పడుతున్నాయి. మరి ఈ ఎఫెక్ట్ ఇండస్ట్రీపై ఏ మేర పడుతుంది.. ఖర్చులు తగ్గించుకోవడం పక్కనబెడితే టికెట్ రేట్ల మీద ఆదాయం ఏ మేర వస్తుందనే సందిగ్ధత ప్రస్తుతం ఇండస్ట్రీలో నెలకొంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కరెంట్ లేకుండానే కూలింగ్! ఇక ఏసీతో పనిలేదు

వామ్మో… ఆ ఊరి నిండా పాములే! ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న గ్రామం

Aadhaar Update: ఆధార్ అప్డేట్‌‌పై కేంద్రం గుడ్‌ న్యూస్‌

భీమేశ్వరాలయ సమీపంలో అరుదైన శ్వేతనాగు.. ప్రత్యక్షం

కుక్కను వెంబడిస్తూ వెళితే.. బయటపడిన 18 వేల ఏళ్ల రహస్య ప్రపంచం

Follow Us