హైదరాబాద్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు రూ.3.5 కోట్ల విలువైన 8.705 కిలోల గంజాయిని పట్టుకున్నారు. బ్యాంకాక్ నుండి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల లగేజీలో ఆహార పదార్థాలలో దాచిన గంజాయిని గుర్తించారు. నిందితులను అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు.