సికింద్రాబాద్ పరిధిలోని బోయినపల్లి పోలీస్ స్టేషన్లో మహిళా ఎస్సై నందిత లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఓ కేసు విషయంలో బాధితుడి నుండి డబ్బులు డిమాండ్ చేయడమే కాకుండా, స్టేషన్లో అందరికీ వాటాలు ఇవ్వాలని ఆమె ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం.