AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dhurandhar The Revenge OTT: 20 రోజుల గ్యాప్.. మరీ టూ మచ్ గురూ

Dhurandhar The Revenge OTT: 20 రోజుల గ్యాప్.. మరీ టూ మచ్ గురూ

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: May 21, 2026 | 5:41 PM

Share

‘ధురంధర్ 2’ ఓటీటీ విడుదల వ్యూహంపై ఇప్పుడు భారీ చర్చ నడుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ సినిమా, ఇండియాలో మాత్రం ఆలస్యంగా హాట్‌స్టార్‌లో రానుండటంతో పైరసీ విపరీతంగా పెరిగింది. ఇప్పటికే గ్లోబల్ స్థాయిలో భారీ క్రేజ్ దక్కించుకున్న ఈ చిత్రానికి వేర్వేరు ఓటీటీ రిలీజ్ డేట్లు మైనస్ అయ్యాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ధురంధర్ విషయంలో ఇప్పటి వరకు అన్నీ ప్లాన్ ప్రకారమే జరిగాయి.. ఒక్కటి కూడా మిస్ ఫైర్ కాలేదు. వాళ్లేం ముట్టుకున్నా మిడాస్ టచ్ మాదిరి బంగారమే అయింది. కానీ ఫస్ట్ టైమ్ ధురంధర్ 2టీంకు అనుకోని షాక్ భారీగా తగిలేలా కనిపిస్తుంది. తెలిసి చేసారో.. తెలియక చేసారో తెలియదు కానీ మొత్తానికి వాళ్ల డిసిషన్ సినిమాపై గట్టి ఎఫెక్ట్ చూపిస్తుంది. మరి ఏంటా నిర్ణయం..? ఇండియన్ బాక్సాఫీస్‌ను ధురంధర్ ఫ్రాంచైజీ ఎలా ఏలేసిందనే విషయం ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. డిసెంబర్ నుంచి నాన్ స్టాప్ బ్యాటింగ్ నడుస్తూనే ఉంది. పార్ట్ 1 ముందు థియేటర్లు.. తర్వాత OTT.. అలా పర్ఫెక్ట్ ప్లాన్‌తో వచ్చారు. కానీ పార్ట్ 2 విషయంలోనే నిర్మాతలు తీసుకున్న నిర్ణయం సినిమాను కన్ఫ్యూజన్ స్టేజ్‌లోకి నెట్టేసింది. ధురంధర్ 2 ఏకంగా 1700 కోట్లకు పైగా వసూలు చేసింది. థియేటర్లలో 50 రోజులకు పైగానే ఆడింది. ఈ మధ్యే నెట్ ఫ్లిక్స్ వేదికగా మే 15న గ్లోబల్ రిలీజ్ అయింది. ఇండియాలో మినహా.. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా OTTలో వచ్చేసింది.. ఇండియాలో మాత్రం హాట్ స్టార్‌లో జూన్ 4న రానుంది. ఇక్కడే తేడా కొడుతుంది వ్యవహారం.. ఓటిటి వర్షన్ పైరసీ చేసి ఇండియాలోనూ విచ్చలవిడిగా చూస్తున్నారు ఆడియన్స్. ఈరోజుల్లో థియేటర్లో ఉన్న సినిమాను పైరసీ కాకుండా ఆపడమే కష్టం అనుకుంటే.. OTTకి వచ్చాక ఆపతరమా..? ఆల్రెడీ ధురంధర్ 2 దెబ్బకు పాకిస్తాన్ సర్వర్లు కూడా క్రాష్ అయిపోయాయి.. గ్లోబల్ రీచ్ అదిరింది. ఇంత క్రేజ్ ఉన్న సినిమా ఓటిటి రిలీజ్ ఒకేసారి కాకుండా.. 20 రోజుల గ్యాప్ ఇవ్వడం కరెక్ట్ నిర్ణయం కాదేమో అనే చర్చ మొదలైందిప్పుడు. మరి దీనిపై OTT నిర్వాహకులు పునరాలోచనలో పడ్డారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కరెంట్ లేకుండానే కూలింగ్! ఇక ఏసీతో పనిలేదు

వామ్మో… ఆ ఊరి నిండా పాములే! ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న గ్రామం

Aadhaar Update: ఆధార్ అప్డేట్‌‌పై కేంద్రం గుడ్‌ న్యూస్‌

భీమేశ్వరాలయ సమీపంలో అరుదైన శ్వేతనాగు.. ప్రత్యక్షం

కుక్కను వెంబడిస్తూ వెళితే.. బయటపడిన 18 వేల ఏళ్ల రహస్య ప్రపంచం

Follow Us