ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్.. పీక్స్‌లో ఉండగానే సినిమాలకు గుడ్ బై
Rajitha Chanti
Pic credit - Instagram
21 May 2026
'మా ఊరి పొలిమేర' చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటి కామాక్షి భాస్కర్ల. ఈమధ్య సంచలన నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతం హీరోయిన్‌గా, కీలక పాత్రధారిగా కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో ఆమె సినిమాలకు విరామం ప్రకటిస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు.
ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. మిస్ ఇండియా తెలంగాణ (2018) రన్నరప్‌గా నిలిచింది.
ఆ తర్వాత చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం', 'రౌడీ బాయ్స్', 'విరూపాక్ష', 'ఓం భీమ్ బుష్ చిత్రాలతో ఫేమస్ అయ్యింది.
వైవిధ్యమైన పాత్రలు పోషించి నటిగా మంచి మార్కులు కొట్టేసింది. మా ఊరి పొలిమేర 1, 2 సినిమాల్లో ఆమె అభినయానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
'డెకాయిట్: ఏ లవ్ స్టోరీ' చిత్రంలోనూ ఆమె ఒక ముఖ్య పాత్ర పోషించారు. ప్రస్తుతం ఆమె చేతిలో 'అగధ', 'మా ఊరి పొలిమేర 3' వంటి క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి.
సినిమాలు, నటన మీద విసుగు వచ్చి నేను ఈ బ్రేక్ తీసుకోవడం లేదు. కేవలం నా మానసిక ఆరోగ్యానికి, స్వీయ సంరక్షణ కోసమే బ్రేక్ తీసుకున్నట్లు తెలిపారు.
నాకు ఎలాంటి తొందర లేదు. ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటూ, నా ఉనికిని నేను గుర్తు చేసుకోవాలనుకుంటున్నాను అని కామాక్షి ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
మరిన్ని వెబ్ స్టోరీస్
అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్..
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్