Paytm: టీనేజర్లకు పేటీఎం బంపర్ ఆఫర్.. కొత్త ఫీచర్ వైరల్
బ్యాంకు ఖాతా లేని టీనేజర్లు కూడా యూపీఐ చెల్లింపులు చేసుకునేందుకు ‘పేటీఎం పాకెట్ మనీ’ ఫీచర్‌ను పేటీఎం ప్రారంభించింది. యూపీఐ సర్కిల్ ఆధారంగా పనిచేసే ఈ సేవతో తల్లిదండ్రులు పిల్లల ఖర్చులను నియంత్రించడంతో పాటు పర్యవేక్షించవచ్చు. రోజువారీ చిన్న చెల్లింపులకు ఈ ఫీచర్ ఉపయోగపడనుండగా, భద్రత కోసం ఖర్చులపై ప్రత్యేక పరిమితులు కూడా అమలు చేశారు.
డిజిటల్ చెల్లింపుల దిగ్గజం పేటీఎం టీనేజర్లను లక్ష్యంగా చేసుకుని సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ‘పేటీఎం పాకెట్ మనీ’ పేరుతో ప్రారంభించిన ఈ సరికొత్త ఫీచర్ ద్వారా బ్యాంకు ఖాతా లేని టీనేజర్లు సైతం ఇకపై నేరుగా యూపీఐ చెల్లింపులు చేసుకోవచ్చు. నగదు అవసరాల కోసం లేదా చిన్న చిన్న పేమెంట్స్ కోసం ప్రతిసారీ తల్లిదండ్రులపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా ఈ ఫీచర్ తోడ్పడుతుందని కంపెనీ బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రకటనలో తెలిపింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టిన ‘యూపీఐ సర్కిల్’ ఆధారంగా ఈ సేవలు పనిచేస్తాయి. దీని ద్వారా బ్యాంకు ఖాతా ఉన్న ప్రాథమిక యూజర్ అంటే తల్లి లేదా తండ్రి, తమ పిల్లలను సెకండరీ యూజర్‌గా చేర్చుకోవచ్చు. దీనివల్ల ఒకే అకౌంట్‌తో పిల్లలు కూడా తమ సొంత ఫోన్ల ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పేమెంట్స్ చేయవచ్చు. ప్రతిసారీ తల్లిదండ్రుల ఫోన్ తీసుకోవడం, ఓటీపీల కోసం వేచి చూడటం లేదా క్యూఆర్ కోడ్‌ను వాట్సాప్‌లో పంపడం వంటి ఇబ్బందులు దీనితో తప్పుతాయి. పిల్లలు దుబారా ఖర్చులు చేయకుండా ఉండేందుకు తల్లిదండ్రులు పూర్తి నియంత్రణ కలిగి ఉండవచ్చు. ఈ ఫీచర్ ద్వారా ప్రతి లావాదేవీకి గరిష్ఠంగా రూ. 5,000, నెలవారీ మొత్తం ఖర్చుకు రూ. 15,000 వరకు పరిమితి విధించారు. భద్రతా కారణాల దృష్ట్యా, ఫీచర్ సెటప్ చేసిన మొదటి 30 నిమిషాల్లో రూ. 500, మొదటి 24 గంటల్లో రూ. 5,000 వరకు మాత్రమే విక్రయాలు జరపడానికి వీలవుతుంది. ‘పేటీఎం స్పెండ్ సమ్మరీ’ ద్వారా పిల్లల ఖర్చులను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించవచ్చు. అవసరమైతే యాక్సెస్‌ను తక్షణమే రద్దు చేసే అధికారం కూడా వారికి ఉంటుంది. పాఠశాల, కాలేజీ క్యాంటీన్లు, మెట్రో, షాపింగ్ వంటి రోజువారీ అవసరాలకు ఈ ఫీచర్ ఎంతగానో ఉపయోగపడనుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆ ఒక్క మాటతో.. ఆ మేనేజర్ లేచి వెళ్లిపోయాడు !
కొమ్ముతో ఏకంగా జీపును ఎత్తిపడేసింది! భయంతో కేకలు వేసిన టూరిస్ట్‌లు.. చివరకు..
10 నిమిషాల డెలివరీ కంటే ప్రశాంతతే ముఖ్యం! బ్యాంకాక్‌లో భారత మహిళ పోస్ట్ వైరల్
కరెంట్ లేకుండానే కూలింగ్! ఇక ఏసీతో పనిలేదు
వామ్మో… ఆ ఊరి నిండా పాములే! ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న గ్రామం
ఆ ఒక్క మాటతో.. ఆ మేనేజర్ లేచి వెళ్లిపోయాడు !
కొమ్ముతో జీపును ఎత్తిపడేసింది! భయంతో కేకలు వేసిన టూరిస్ట్‌లు..
10 నిమిషాల డెలివరీ కంటే ప్రశాంతతే ముఖ్యం!
కరెంట్ లేకుండానే కూలింగ్! ఇక ఏసీతో పనిలేదు
వామ్మో... ఆ ఊరి నిండా పాములే!
భీమేశ్వరాలయ సమీపంలో అరుదైన శ్వేతనాగు.. ప్రత్యక్షం
కుక్కను వెంబడిస్తూ వెళితే.. బయటపడిన 18 వేల ఏళ్ల రహస్య ప్రపంచం

