AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యూపీఐ ఛార్జీలపై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన

యూపీఐ ఛార్జీలపై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన

Phani CH
|

Updated on: Aug 09, 2026 | 5:00 PM

Share

యూపీఐ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) విధించే అంశం కేంద్రం, కాంగ్రెస్ మధ్య రాజకీయ దుమారం రేపుతోంది. అమెరికా ఒత్తిడికి తలొగ్గి యూపీఐపై ఛార్జీలకు ప్రభుత్వం మార్గం సుగమం చేస్తోందని జైరామ్ రమేష్ ఆరోపించగా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఖండించారు. MDR కేవలం వ్యాపారులకే వర్తిస్తుందని, సాధారణ వినియోగదారులపై ఎలాంటి భారం ఉండదని ఆమె స్పష్టం చేశారు. తుది నిర్ణయం NPCI కమిటీ తీసుకుంటుందని తెలిపారు.

యూపీఐ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ విధించే అంశంపై కేంద్ర ప్రభుత్వం మరియు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీల మధ్య తీవ్ర స్థాయి రాజకీయ యుద్ధం జరుగుతోంది. యూఎస్‌ ట్రేడ్ రిప్రజెంటేటివ్ 2026 నివేదికలో భారత్ తెచ్చిన ‘జీరో-MDR’ విధానాన్ని విమర్శించిన తర్వాతే కేంద్రం ఈ మార్పులు చేస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ తీవ్ర ఆరోపణలు చేశారు. అమెరికా ఒత్తిడికి తలొగ్గి విదేశీ కంపెనీలకు మేలు చేసేందుకు, పన్నులు మరియు ఇతర చట్టాల బిల్లు, 2026 ద్వారా యూపీఐపై ఛార్జీలు మోపేందుకు ప్రభుత్వం మార్గం సుగమం చేస్తోందని విమర్శించారు. ఆర్‌బిఐ వద్ద ఉన్న మిగులు నిధులలో ఒక చిన్న భాగాన్ని వినియోగిస్తే యూపీఐని ఉచితంగా నిర్వహించవచ్చని ఆయన స్పష్టం చేశారు. గ్రెస్ ఆరోపణలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్రంగా ఖండించారు. ఎంబీఆర్ ఛార్జీలు కేవలం వ్యాపారులకు మాత్రమే వర్తిస్తాయని, సాధారణ వినియోగదారుడిపై ఒక్క రూపాయి కూడా భారం పడదని తేల్చి చెప్పారు. ఈ రుసుము వలన వచ్చే ఆదాయం బ్యాంకులు, ఫిన్‌టెక్ కంపెనీలు తమ డిజిటల్ మౌలిక సదుపాయాలు, సైబర్ భద్రత మరియు కొత్త సాంకేతికతపై పెట్టుబడులు పెట్టడానికి సహాయపడుతుందని, దీనివల్ల అంతిమంగా యూపీఐ వినియోగదారులకే ఎక్కువ లబ్ధి చేకూరుతుందని వెల్లడించారు. అంతేకాకుండా, పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ యాక్ట్, 2007లోని సెక్షన్ 10Aను సవరించే బిల్లును పార్లమెంట్ ఆమోదించిన తర్వాతే NPCI నేతృత్వంలోని స్టీరింగ్ కమిటీ ఎంబీఆర్ అమలుపై తుది నిర్ణయం తీసుకుంటుందని మంత్రి వివరించారు. కాంగ్రెస్ సభను అడ్డుకోకుండా నిర్మాణాత్మక చర్చల్లో పాల్గొని ఉంటే ఈ విషయాలపై స్పష్టత వచ్చేదని స్పష్టం చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రిటైరైనా తగ్గని క్రేజ్.. బ్రాండ్ రేసులో దూసుకెళ్తున్న మాస్టర్‌ బ్లాస్టర్‌

తన తండ్రి ఎలా మరణించారో వివరిస్తూ.. బోరున ఏడ్చిన కొడుకు

Allu Arjun: బన్నీని కలవాలని ప్లాన్ చేస్తున్నారా? అప్‌డేట్ తెలుసుకోవాల్సిందే

 

Follow Us