AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun: బన్నీని కలవాలని ప్లాన్ చేస్తున్నారా? అప్‌డేట్ తెలుసుకోవాల్సిందే

Allu Arjun: బన్నీని కలవాలని ప్లాన్ చేస్తున్నారా? అప్‌డేట్ తెలుసుకోవాల్సిందే

Phani CH
|

Updated on: Aug 09, 2026 | 4:48 PM

Share

విశాఖపట్నంలో జరగనున్న AAA మాల్ ప్రారంభోత్సవానికి అల్లు అర్జున్ హాజరుకానున్న నేపథ్యంలో భారీగా అభిమానులు తరలివచ్చే అవకాశం ఉంది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా సాధారణ ప్రజలకు ఈవెంట్‌లోకి ప్రవేశం ఉండదని సమాచారం. అల్లు అర్జున్ మాల్ పైభాగం నుంచి అభిమానులకు అభివాదం చేసి కార్యక్రమంలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. లోపలి వేడుకకు ఆహ్వానితులకు మాత్రమే అనుమతి ఉంటుందని సమాచారం. నిర్వాహకుల అధికారిక ప్రకటన తర్వాతే పూర్తి వివరాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

అల్లు అర్జున్‌ను దగ్గరగా చూడాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ముందుగా ఈ అప్‌డేట్ తెలుసుకోవాల్సిందే. AAA విజాగ్ ప్రారంభోత్సవానికి అభిమానులకు ఎంట్రీ లేదట! ఎస్ ! మీరు విన్నది నిజమే! ఇక విశాఖపట్నంలో జరగనున్న AAA మాల్ ప్రారంభోత్సవానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాజరుకానున్నారు. దీంతో భారీ సంఖ్యలో అభిమానులు అక్కడికి చేరుకునే అవకాశం ఉంది.అయితే పోలీసుల కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నేపథ్యంలో సాధారణ ప్రజలను మాల్‌లోకి అనుమతించబోరని సమాచారం. అభిమానులతో ప్రత్యేకంగా మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం కూడా ఉండదని తెలుస్తోంది. అల్లు అర్జున్ మాల్ పైభాగం నుంచి అభిమానులకు అభివాదం చేసి, ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని వెళ్లిపోతారని సమాచారం. లోపల జరిగే ఈవెంట్‌కు కేవలం ఆహ్వానితులకు మాత్రమే అనుమతి ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రారంభోత్సవం పూర్తయ్యాక, బన్నీ పాల్గొన్న కార్యక్రమానికి సంబంధించిన ఇన్‌సైడ్ విజువల్స్‌ను నిర్వాహకులు విడుదల చేసే అవకాశం ఉంది. కాబట్టి… బన్నీని చూసేందుకు వెళ్లే అభిమానులు ఈ విషయాన్ని ముందుగానే గుర్తుంచుకోవడం మంచిది. అయితే నిర్వాహకుల నుంచి అధికారికంగా ఏవైనా కొత్త వివరాలు వస్తే పరిస్థితుల్లో మార్పులు ఉండొచ్చు. ఇలాంటి లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం మా ఛానల్‌ను ఫాలో అవ్వండి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్లాస్టిక్‌ కరెన్సీపై కేంద్రం క్లారిటీ.. ఇక పేపర్‌ నోట్లు బంద్‌?

అంతరిక్షంలోకి 13.5 లక్షల మంది పేర్లు.. నాసా సరికొత్త ప్రయోగం!

డెన్మార్క్ రాజకుమారి సంచలనం.. రాయల్ లైఫ్ వదిలి మిలిటరీలోకి ప్రిన్సెస్ ఇసాబెల్లా!

మీ రేషన్ కార్డ్ స్మార్ట్‌కార్డ్‌గా మారబోతోంది.. ఆగస్టు 15న పంపిణీ

హైదరాబాద్‌లో అతిపెద్ద క్రైసిస్.. ఇళ్లు వదిలి పారిపోతున్న పిల్లలు.. తప్పు ఎక్కడ జరుగుతోంది?

Follow Us