ప్లాస్టిక్ కరెన్సీపై కేంద్రం క్లారిటీ.. ఇక పేపర్ నోట్లు బంద్?
భారత్‌లో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టేందుకు ఆర్బీఐ చర్యలు వేగవంతం చేస్తోంది. తొలిదశలో రూ.10, రూ.20 నోట్లను ప్రయోగాత్మకంగా తీసుకురావాలని భావిస్తోంది. అయితే ప్లాస్టిక్ నోట్లు వస్తే పేపర్ కరెన్సీని నిలిపివేస్తారనే ప్రచారంపై కేంద్రం స్పష్టత ఇచ్చింది. ప్రస్తుతం చలామణిలో ఉన్న కాగితపు నోట్లు కొనసాగుతాయని, వాటిని మార్చుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది. ప్లాస్టిక్ నోట్లపై పైలట్ ప్రాజెక్ట్ ఫలితాలను బట్టి తదుపరి నిర్ణయాలు తీసుకోనున్నారు.
భారతీయ రిజర్వ్ బ్యాంక్ త్వరలోనే దేశంలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదం తెలపడంతో, పాలిమర్‌తో కూడిన ప్లాస్టిక్ నోట్ల ముద్రణకు సంబంధించి అంతర్జాతీయ కంపెనీల నుంచి టెండర్లను ఆహ్వానిస్తోంది. అయితే ఈ వార్తలు వెలువడినప్పటి నుంచి ప్రజల్లో ఒకే రకమైన ఆందోళన మొదలైంది. ప్లాస్టిక్ నోట్లు వస్తే ప్రస్తుతం చలామణిలో ఉన్న కాగితపు కరెన్సీ నిలిపివేస్తారా? అనే ప్రచారం ఊపందుకుంది. ఈ సందేహాలు, ఉహాగానాలపై కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి స్పష్టతనిచ్చారు. ప్రస్తుతం అమల్లో ఉన్న పేపర్ కరెన్సీ నోట్లను నిలిపివేసే ఆలోచన గానీ, ప్రతిపాదన గానీ ప్రభుత్వం వద్ద లేదని ఆయన తేల్చి చెప్పారు. ప్లాస్టిక్ నోట్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా పాత కాగితపు కరెన్సీ యథావిధిగా చలామణిలో ఉంటుందని, ప్రజలు తమ దగ్గరున్న డబ్బును మార్చుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. పౌరులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఆర్బీఐ మొదటగా ప్రయోగాత్మకంగా రూ.10, రూ.20 విలువైన ప్లాస్టిక్ నోట్లను పైలట్ ప్రాజెక్ట్ కింద మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. దేశంలోని భిన్నమైన వాతావరణ పరిస్థితులు, ప్రజల వినియోగ తీరును పరిశీలించేందుకు గాను పరిమిత సంఖ్యలోనే వీటిని తయారు చేస్తారు. ఈ ప్రయోగం విజయవంతమైతే భవిష్యత్తులో ఇతర డినామినేషన్లలో కూడా ప్లాస్టిక్ నోట్లను ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే ఆర్బీఐ నోట్ ముద్రణ సంస్థ కోట్లాది పాలిమర్ షీట్ల కోసం గ్లోబల్ టెండర్లు పిలిచింది. కాబట్టి పాత నోట్లు బ్యాన్ అవుతాయనే ప్రచారాన్ని నమ్మవద్దని అధికారులు సూచిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అంతరిక్షంలోకి 13.5 లక్షల మంది పేర్లు.. నాసా సరికొత్త ప్రయోగం!
డెన్మార్క్ రాజకుమారి సంచలనం.. రాయల్ లైఫ్ వదిలి మిలిటరీలోకి ప్రిన్సెస్ ఇసాబెల్లా!
మీ రేషన్ కార్డ్ స్మార్ట్‌కార్డ్‌గా మారబోతోంది.. ఆగస్టు 15న పంపిణీ
హైదరాబాద్‌లో అతిపెద్ద క్రైసిస్.. ఇళ్లు వదిలి పారిపోతున్న పిల్లలు.. తప్పు ఎక్కడ జరుగుతోంది?
తండ్రిని ఆసుపత్రికి తీసుకువెళ్లిన కూతుళ్లు.. ఆ తర్వాత ఏం చేశారో చూడండి!
హైదరాబాద్‌లో అతిపెద్ద క్రైసిస్.. ఇళ్లు వదిలి పారిపోతున్న పిల్లలు
తండ్రిని ఆసుపత్రికి తీసుకువెళ్లిన కూతుళ్లు.. తర్వాత ఏం చేసారంటే
తల్లి గర్భంలోనే సర్జరీ.. వైద్య చరిత్రలోనే అరుదైన అద్భుతం!
కింగ్ కోబ్రా గూడును ఎప్పుడైనా చూశారా..
చదువుకుంటాను.. స్కూల్లో కొత్త అతిథిని చూసి హడలిపోయిన విద్యార్ధులు
150 ఏళ్ల తర్వాత లైబ్రరీకి తిరిగి వచ్చిన పుస్తకం.. కట్ చేస్తే..
వీళ్లు తలతో కొడితే కొబ్బరికాయైనా పగలాల్సిందే

