Gold Price Today: బంగారం నేల చూపులు…ఈరోజు తులం గోల్డ్ ధర ఎంతంటే!
అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ బలపడటంతో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. సెప్టెంబర్ 15న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.920 తగ్గి రూ.1,53,170కు చేరింది. 22 క్యారెట్ల బంగారం రూ.850 తగ్గి రూ.1,40,400గా ఉంది. మరోవైపు వెండి ధరలో ఎలాంటి మార్పు లేకుండా కిలో రూ.2,50,000 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలోనూ ఇదే ధరలు నమోదయ్యాయి. ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా రేట్లు కూడా పరిశీలించండి.
అంతర్జాతీయ మార్కెట్లో ఏర్పడిన ఆందోళనకర ఆర్థిక పరిస్థితులు, మారకపు రేట్ల హెచ్చుతగ్గుల వల్ల బంగారం ధరలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ కమొడిటీ మార్కెట్లో ప్రామాణిక డాలర్ ఇండెక్స్ బలపడటంతో పసిడిపై విక్రయాల ఒత్తిడి పెరిగింది. సాధారణంగా విదేశీ మారకపు మార్కెట్లో అమెరికన్ డాలర్ విలువ పెరిగినప్పుడు, ఇతర కరెన్సీలను ఉపయోగించే అంతర్జాతీయ పెట్టుబడిదారులకు డాలర్లలో విక్రయించే బంగారం కొనుగోలు వ్యయం మరింత ఖరీదైనదిగా మారుతుంది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా పసిడి వినియోగం, పెట్టుబడుల డిమాండ్ మందగించి, అంతర్జాతీయ స్పాట్ మార్కెట్లో ధరలు దిగి వస్తున్నాయి. తాజాగా సెప్టెంబర్ 15 మంగళవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.920 తగ్గి, రూ. 1,53,170 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.850 తగ్గి, రూ.1,40,400 కు చేరింది. ఇక వెండి ధర స్థిరంగా కొనసాగుతూ కేజీ రూ.2,50,000 పలుకుతోంది. సెప్టెంబర్ 15, మంగళవారం దేశంలోని వివిధ నగరాల్లో బంగారం, వెండి ధరలు పరిశీలిస్తే.. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,53,320 వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,40,550 పలుకుతోంది. ముంబై, చెన్నై,కోల్‌కతాలో 24 క్యారెట్ల బంగారం రూ.1,53,170 లు, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,40,400 పలుకుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,53,170 లు, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,40,400 పలుకుతోంది. కేజీ వెండి ధర రూ.2,50,000 గా కొనసాగుతోంది. ఈ ధరలు పెరగవచ్చు.. తగ్గవచ్చు.. బంగారం కొనడానికి వెళ్లేముందు ధరలు మరోసారి చెక్ చేసుకొని వెళితే మంచిది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పండుగ పూట నిండుగా వానలు.. ఆ జిల్లాలకు భారీ వర్ష సూచన ఖరీఫ్ టెన్షన్ తొలగిపోయినట్లేనా?
USలో భారత విద్యార్థులకు ఉపశమనం.. ట్రంప్ నిర్ణయానికి కోర్టు బ్రేక్
కబోర్డ్ ఓపెన్ చేసిన మహిళ.. అందులో ఊహించని సీన్ చూసి హడల్
అర్ధరాత్రి ఉన్నట్టుండి ఇళ్లపై రాళ్ల వర్షం..
భారతీయ భార్యపై అమెరికన్ భర్త ప్రశంసల వర్షం..
చంపాక ఎలా ఏడవాలి అని చాట్‌జీపీటీని అడిగిన ప్రియురాలు
జింక కోసం మాటువేసిన పులి.. నెమలి ఎంట్రీతో..
ఆకాశంలో అద్భుత దృశ్యం.. ఈ రాత్రంతా వీక్షించి ఆస్వాదించండి!
ఒకే ఒక్క సిగరెట్.. ఏం చేసిందో తెలిస్తే గుండెలదురుతాయ్!

