AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బోను నుంచి తప్పించుకున్న చిరుత.. ఆ తర్వాత సీన్‌ చూస్తే..

బోను నుంచి తప్పించుకున్న చిరుత.. ఆ తర్వాత సీన్‌ చూస్తే..

Samatha J
|

Updated on: Sep 17, 2026 | 2:45 PM

Share

నేపాల్‌లోని లంజుంగ్ జిల్లాలో అటవీశాఖ అధికారులు బంధించిన ఓ చిరుతపులి బోను నుంచి తప్పించుకుని కలకలం సృష్టించింది. మత్తు వదిలిపోవడంతో ఒక్కసారిగా చురుగ్గా మారిన చిరుత, సిబ్బందిపై దాడికి దిగి గార్డు బుద్ధి జంగ్ గురుంగ్‌ను గాయపరిచింది. కార్యాలయ ప్రాంగణంలో హంగామా సృష్టించిన చిరుతను ఎట్టకేలకు తిరిగి బంధించారు. ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

నేపాల్‌లోని లంజుంగ్ జిల్లా బేసిసహర్ ప్రాంతంలో ఇటీవల ఓ చిరుతపులి చేసిన హంగామా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సెప్టెంబర్ 10న లంజుంగ్ జిల్లాలో సంచరిస్తున్న చిరుతను అటవీశాఖ అధికారులు సురక్షితంగా బంధించారు. మత్తుమందు ఇచ్చి దానిని అటవీశాఖ కార్యాలయానికి తరలించారు.అయితే, ఎన్‌క్లోజర్‌లో ఉంచే సమయానికి చిరుతకు మత్తు వదిలిపోయింది. అకస్మాత్తుగా చురుగ్గా మారిన ఆ చిరుత బోను తలుపును తోసుకుంటూ ఒక్క ఉదుటన బయటకు దూకింది. ఈ ఊహించని పరిణామంతో అక్కడ ఉన్న సిబ్బంది ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. చిరుత వెంటనే సిబ్బందిపై దాడికి దిగింది. ఈ ఘటనలో 57 ఏళ్ల అటవీశాఖ గార్డు బుద్ధి జంగ్ గురుంగ్ చేతిని చిరుత గట్టిగా కొరకటంతో ఆయన గాయపడ్డారు.వెంటనే అప్రమత్తమైన సిబ్బంది గురుంగ్‌ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. బోను నుంచి తప్పించుకున్న చిరుత కార్యాలయ ఆవరణలో అటూ ఇటూ తిరుగుతూ తీవ్ర కలకలం సృష్టించింది. ఒక స్తంభాన్ని ఎక్కేందుకు కూడా ప్రయత్నించింది. చివరకు, అటవీశాఖ సిబ్బంది అందరూ కలిసి ఎంతో కష్టపడి ఆ చిరుతను మళ్లీ బంధించి ఎన్‌క్లోజర్‌లో సురక్షితంగా ఉంచారు. చిరుత తప్పించుకున్న ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

మరిన్ని వీడియోల కోసం :

బిగ్ బాస్‌ టాస్కులేమో కానీ ఆ కంటెస్టెంట్ నడుము విరిగినంత పనైంది

నేనే త్రిష స్థానంలో ఉంటే..నటి అంబిక షాకింగ్ కామెంట్స్

నా 3 కోట్లు నాకు ఇప్పించండి…కోర్టుకెక్కిన ఐబొమ్మ రవి

హాలీవుడ్‌లోకి మహారాజ్‌ మూవీ…హీరో ఎవరంటే?

Follow Us