AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హాలీవుడ్‌లోకి మహారాజ్‌ మూవీ...హీరో ఎవరంటే?

హాలీవుడ్‌లోకి మహారాజ్‌ మూవీ…హీరో ఎవరంటే?

Samatha J
|

Updated on: Sep 17, 2026 | 12:04 PM

Share

నితిలన్ స్వామినాథన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి నటించిన మహారాజా చిత్రం హాలీవుడ్‌లో రీమేక్ కానుంది. ఇండియా, చైనాలలో భారీ విజయం సాధించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ రీమేక్ హక్కులను ఒక హాలీవుడ్ ఏజెన్సీ కొనుగోలు చేసింది. ఈ సినిమాలో హాలీవుడ్ స్టార్ మ్యాథ్యూ మెకానాహే ప్రధాన పాత్ర పోషించే అవకాశం ఉందని టాక్.

నితిలన్ స్వామినాథన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కిన సంచలన చిత్రం మహారాజా ఇప్పుడు హాలీవుడ్‌లో రీమేక్ కానుంది. 2024లో విడుదలైన ఈ క్రైమ్ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద పెను సంచలనం సృష్టించింది. కేవలం ఇండియాలోనే కాకుండా, చైనాలో కూడా ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించింది. అక్కడ థియేటర్లలో ₹91 కోట్లకు పైగా వసూలు చేయడమే కాకుండా, ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలోనూ ప్రశంసలు అందుకుంది. ఈ అపూర్వమైన విజయాన్ని దృష్టిలో ఉంచుకొని, ఒక ప్రముఖ హాలీవుడ్ ఏజెన్సీ మహారాజా రీమేక్ హక్కులను కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాతలలో ఒకరైన సుధన్ సుందరం అధికారికంగా ప్రకటించారు. ఈ భారీ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలిపారు. హాలీవుడ్ రీమేక్ చిత్రంలో ప్రధాన పాత్రలో హాలీవుడ్‌కు చెందిన అగ్రశ్రేణి నటుడు మ్యాథ్యూ మెకానాహే కనిపించనున్నారని ప్రస్తుతం వార్తలు వినిపిస్తున్నాయి.

Follow Us