నేనే త్రిష స్థానంలో ఉంటే..నటి అంబిక షాకింగ్ కామెంట్స్
తమిళ స్టార్ విజయ్, హీరోయిన్ త్రిషల వైరల్ వీడియోపై ప్రముఖ నటి అంబికా సంచలన వ్యాఖ్యలు చేశారు. యూకేలోని సిల్వర్‌స్టోన్‌లో జరిగిన లే మాన్స్ కప్ రేస్‌లో వీరిద్దరూ కలిసి కనిపించిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. త్రిష స్థానంలో తాను ఉంటే అలా కెమెరాల ముందు కనిపించేదాన్ని కాదంటూ అంబికా అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తమిళనాట చర్చనీయాంశంగా మారాయి.
తమిళ స్టార్ హీరో విజయ్, స్టార్ హీరోయిన్ త్రిష మరోసారి వార్తల్లో నిలిచారు. యూకేలోని సిల్వర్‌స్టోన్‌లో జరిగిన అజిత్ కుమార్ ‘లే మాన్స్ కప్’ రేస్‌లో వీరిద్దరూ కలిసి కనిపించారు. ఈ కార్యక్రమాన్ని విజయ్ జెండా ఊపి ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా విజయ్, త్రిషలకు సంబంధించి ఒక వీడియో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. రేసింగ్ ఈవెంట్‌ను విజయ్ గ్యాలరీ నుంచి వీక్షిస్తుండగా, సడెన్‌గా త్రిష మధ్యలోకి వచ్చారు. అయితే విజయ్ వెంటనే తన ముఖం వీడియోలో పడకుండా పక్కకు తప్పుకునేందుకు ప్రయత్నించారు. కానీ అది వర్కౌట్ కాలేదు. వీరిద్దరూ కలిసిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో, త్రిష-విజయ్‌ల స్నేహం మరోసారి చర్చనీయాంశంగా మారింది.ఈ క్రమంలోనే ప్రముఖ నటి అంబికా విజయ్-త్రిష రిలేషన్‌పై స్పందించారు. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో అంబికా మాట్లాడుతూ. త్రిష స్థానంలో తాను ఉంటే, తన వల్ల అనవసరమైన నెగెటివిటీ వస్తుందని తెలిస్తే అలాంటి ఈవెంట్స్‌కు వెళ్లేదాన్ని కాదని, ఒకవేళ వెళ్లినా కెమెరాల కంట పడకుండా జాగ్రత్త పడేదాన్నని ఆమె అన్నారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే అని కూడా ఆమె స్పష్టం చేశారు.
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

