త్రిష
దక్షిణ భారత చలనచిత్ర రంగంలో అగ్ర కథానాయికగా వెలుగొందుతున్న నటి త్రిష కృష్ణన్. 1983 మే 4న చెన్నైలో జన్మించారు. 1999లో ‘మిస్ చెన్నై’ కిరీటాన్ని కైవసం చేసుకుని, ఆపై మోడలింగ్ నుండి సినీ రంగ ప్రవేశం చేశారు. సుమారు రెండు దశాబ్దాలకు పైగా తన కెరీర్‌లో తమిళ, తెలుగు భాషల్లో అనేక బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించారు. తెలుగులో ‘వర్షం’ సినిమాతో భారీ గుర్తింపు తెచ్చుకున్న త్రిష, ఆ తర్వాత ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘అతడు’ వంటి చిత్రాలతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. ఆమె నటనకు గాను పలు ఫిల్మ్‌ఫేర్, నంది అవార్డులను అందుకున్నారు. సినిమాలతో పాటు ఆమె సామాజిక సేవలో కూడా చురుగ్గా పాల్గొంటారు. జంతు సంక్షేమం, యునిసెఫ్ (UNICEF) తరపున బాలల హక్కుల కోసం రాయబారిగా వ్యవహరిస్తున్నారు. ప్రేమ, పెళ్లికి దూరంగా ఉంటూ పూర్తిగా నటనపైనే దృష్టి సారించింది. అయితే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో విజయ్ దళపతి గెలవగా.. ఎక్కువగా త్రిష పేరు మారుమోగింది.
ఇంకా చదవండిCinema: థియేటర్లలో 300 కోట్లకు పైగా కలెక్షన్లు.. OTTలో రికార్డు వ్యూస్.. ఇప్పుడు టీవీలోకి బ్లాక్ బస్టర్ మూవీ
ఈ ఏడాది ప్రారంభంలో థియేటర్లలో రిలీజైన ఈ సినిమా సుమారు రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆపై ఓటీటీలోనూ రిలీజై రికార్డు వ్యూస్ సొంతం చేసుకుంది. ఇప్పుడు బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు టీవీలోకి వచ్చేస్తోంది. ఐఎమ్ డీబీలో ఈ సినిమాకు టాప్ రేటింగ్ దక్కడం విశేషం.
- Basha Shek
- Updated on: Sep 24, 2026
- 1:33 pm
నేనే త్రిష స్థానంలో ఉంటే..నటి అంబిక షాకింగ్ కామెంట్స్
తమిళ స్టార్ విజయ్, హీరోయిన్ త్రిషల వైరల్ వీడియోపై ప్రముఖ నటి అంబికా సంచలన వ్యాఖ్యలు చేశారు. యూకేలోని సిల్వర్‌స్టోన్‌లో జరిగిన లే మాన్స్ కప్ రేస్‌లో వీరిద్దరూ కలిసి కనిపించిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. త్రిష స్థానంలో తాను ఉంటే అలా కెమెరాల ముందు కనిపించేదాన్ని కాదంటూ అంబికా అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తమిళనాట చర్చనీయాంశంగా మారాయి.
- Samatha J
- Updated on: Sep 17, 2026
- 11:40 am
CM Vijay- Trisha: నేనే గనక త్రిష స్థానంలో ఉంటే.. హాట్ టాపిక్‌గా సీనియర్ నటి అంబిక కామెంట్స్
కోలీవుడ్‌లో నెంబర్ వన్ హీరోగా ఉన్న విజయ్ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి స్టార్ హీరోయిన్ త్రిష పేరు తెగ వినిపిస్తోంది. ఇక విజయ్ ఎన్నికల్లో గెలిచి, తమిళనాడు సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీనీ, రాజకీయాల్లోనూ త్రిష పేరు మరింత ట్రెండ్ అయిపోయింది.
- Basha Shek
- Updated on: Sep 16, 2026
- 2:46 pm
Trisha Krishnan: లగ్జరీ ఇళ్లు.. కార్లు.. త్రిష ఆస్తులు విలువ ఎంతో తెలుసా?
దక్షిణాదిలో రెండు దశాబ్దాలకు పైగా అగ్ర కథానాయికగా కొనసాగుతున్న త్రిష కృష్ణన్, సంపాదనలోనూ దూసుకుపోతున్నారు. మీడియా నివేదికల ప్రకారం ఆమె నికర ఆస్తుల విలువ సుమారు రూ.85 కోట్లుగా ఉంది. ఒక్కో సినిమాకు రూ.10-12 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. చెన్నై, హైదరాబాద్‌లో విలాసవంతమైన ఇళ్లు, విదేశీ పెట్టుబడులతో పాటు ఖరీదైన మెర్సిడెస్, బీఎండబ్ల్యూ, రేంజ్ రోవర్, ఆడి కార్లు ఆమె సొంతం.
- Phani CH
- Updated on: Aug 20, 2026
- 5:29 pm
Trisha: తల్లి చీరలో తళుక్కుమన్న త్రిష.. ఇది చాలా స్పెషల్ అంటూ ఫొటోస్ షేర్ చేసిన బ్యూటీ క్వీన్
తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ పాల్గొన్న తొలి ఇండిపెండెన్స్ డే వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది త్రిష. ఈ వేడుకకు ఆమె ఒక ప్రత్యేకమైన చీరలో హాజరైంది. అయితే తాజాగా ఇది తన తల్లి చీర అని చెప్పిన త్రిష అందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
- Basha Shek
- Updated on: Aug 16, 2026
- 5:52 pm
అట్రాక్షన్ అంతా ఆమెదే.. సీఎం విజయ్‌కు సెల్యూట్ చేసిన త్రిష.. ఇదిగో వీడియో
చెన్నై మెరీనా బీచ్ వేదికగా జరిగిన తమిళనాడు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో నటి త్రిష ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ముఖ్యమంత్రి విజయ్ తల్లిదండ్రుల పక్కనే మినిస్టర్స్ గ్యాలరీలో ఆమెకు ప్రత్యేక వీఐపీ సీటు కేటాయించడం ఆసక్తికరంగా మారింది. బంగారు రంగు చీరలో వేడుకలకు హాజరైన త్రిష.. అతిథులను పలకరిస్తూ సందడి చేశారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో త్రిషకు వరుసగా లభిస్తున్న ప్రాధాన్యతపై తమిళనాడు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
- Shaik Madar Saheb
- Updated on: Aug 15, 2026
- 10:49 am
Tamil Nadu: మరోసారి హాట్ టాపిక్‌గా మారిన త్రిష.. ఏఐఏడీఎంకే నేత సంచలన వ్యాఖ్యలు!
తమిళనాడు రాజకీయాల్లో నటి త్రిష పేరు మరోసారి తీవ్ర రాజకీయ వివాదానికి కేంద్రంగా మారింది. ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత జోసఫ్ విజయ్‌ను లక్ష్యంగా చేసుకుని ఏఐఏడీఎంకే సీనియర్ నేత ఆర్.బి. ఉదయకుమార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. విజయ్‌తో త్రిషకు ఉన్నట్లు ప్రచారంలో ఉన్న వ్యక్తిగత సంబంధాలను ప్రస్తావిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలపై త్రిష అభిమానులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
- Balaraju Goud
- Updated on: Aug 11, 2026
- 4:10 pm
Udhayanidhi Stalin: అత్యంత అసభ్యంగా, నీచంగా మాట్లాడాడు.. త్రిషకు బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే.. ఖుష్బూ
టాలీవుడ్ హీరోయిన్ త్రిషను ఉద్దేశిస్తూ ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తమిళనాడులో తీవ్ర వివాదాస్పదమయ్యాయి. దీంతో ఆయన తీరుపై టీవీకే నేతలు ఫిర్యాదు చేయగా పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. మరోవైపు ఉదయనిధి కామెంట్స్ పై రాజకీయ నాయకులు, సినీతారలు మండిపడుతున్నారు. రాజకీయ లబ్ది కోసం మహిళల గౌరవాన్ని బలి చేయడం సరికాదని సీనియర్ నటి ఖుష్బూ సుందర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె తన ఎక్స్ ఖాతాలో సుధీర్ఘ నోట్ రాశారు.
- Rajitha Chanti
- Updated on: Aug 4, 2026
- 4:18 pm
విమాన ప్రయాణంలో త్రిష బ్యూటీ సీక్రెట్.. షీట్ మాస్క్ పై డాక్టర్లు ఏమంటున్నారో తెలుసా?
సౌత్ హీరోయిన్ త్రిష ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. నాలుగు పదుల వయసులోనూ అద్భుతమైన ఫిట్నెస్, గ్లామరస్ లుక్స్ తో కట్టిపడేస్తుంది. అలాగే ఆమె డ్రెస్సింగ్, ఫ్యాషన్, కాస్మోటిక్స్ గురించి తెలుసుకోవడానికి జనాలు తెగ ఆసక్తి చూపిస్తుంటారు. తాజాగా త్రిష గురించి ఓ ఆసక్తికర విషయం నెట్టింట చక్కర్లు కొడుతుంది.
- Rajitha Chanti
- Updated on: Jul 26, 2026
- 12:17 pm
Trisha : జన నాయగన్ ఫస్ట్ డే ఫస్ట్ షో చూసిన త్రిష.. విజయ్ సినిమాపై ఇంట్రెస్టింగ్ పోస్ట్.. నెట్టింట వైరల్..
రాజకీయాలకు ముందు విజయ్ దళపతి నటించిన చివరి సినిమా జన నాయగన్. ఎన్నో వాయిదాలు, వివాదాల అనంతరం ఎట్టకేలకు ఈ సినిమా అడియన్స్ ముందుకు వచ్చింది. మొదటి షో నుంచే ఈ చిత్రానికి పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. ఓవైపు అధికారులతో కలిసి సినిమా వీక్షించారు సీఎం విజయ్. అలాగే త్రిష సైతం తన తల్లితోపాటు స్నేహితులతో కలిసి జన నాయగన్ సినిమాను చూశారు. ఇప్పుడు ఈ మూవీ గురించి ఆమె చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది.
- Rajitha Chanti
- Updated on: Jul 24, 2026
- 9:23 am
Jana Nayagan Movie: చాలా బాధగా ఉంది.. సీఎం విజయ్ ‘జన నాయగన్’ సినిమాపై త్రిష మదర్ కామెంట్స్ వైరల్
తమిళనాడు ముఖ్యమంత్రి, హీరో విజయ్ నటించిన ఆఖరి సినిమా 'జన నాయగన్'. తెలుగులో 'జన నాయకుడు' గా రిలీజైంది. గురువారం (జులై 23) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.
- Basha Shek
- Updated on: Jul 24, 2026
- 6:40 am
అలాంటి హీరోయిన్‌ను నేను ఎప్పుడూ చూడలేదు.. సినిమాలో తీసుకోలేదని అలిగింది
మనసంతా నువ్వే, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, వర్షం, ఒక్కడు లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో “సంక్రాంతి రాజు” గా పేరొందిన మెగా మేకర్ ఎం. ఎస్. రాజు దర్శకుడిగానూ ప్రతిభ చాటుతున్నారు. పలు సినిమాలు దర్శకత్వం వహించి ప్రేక్షకులను మెప్పించారు ఎమ్ ఎస్ రాజు.
- Rajeev Rayala
- Updated on: Jul 4, 2026
- 6:14 pm