పెళ్లి జరగట్లేదన్న బెంగతో యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో ఆరు నెలల్లో 29 మంది యువకులు వివాహ సంబంధిత ఒత్తిడితో బలవన్మరణాలకు పాల్పడ్డారు. బంధుమిత్రుల ప్రశ్నలు, సామాజిక ఒత్తిడి తట్టుకోలేకనే ఈ యువకులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సర్వే వెల్లడించింది. పెళ్లి జీవితంలో ఒక భాగం మాత్రమే.