AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trisha Krishnan: నా కుక్కకు మాత్రమే ఆ పర్మిషన్ ఉంది.. ట్రోలర్స్‌కు ఇచ్చిపడేసిన త్రిష

సౌత్ ఇండస్ట్రీలో త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దాదాపు 2 దశాబ్దాలుగా సినీరంగంలో చక్రం తిప్పుతుంది. ఇప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. ఈ క్రమంలో తాజాగా ఆమె పేరు సోషల్ మీడియాలో మారుమోగుతుంది. అందుకు కారణం విజయ్, సంగీత విడాకులు తీసుకోవడమే.

Trisha Krishnan: నా కుక్కకు మాత్రమే ఆ పర్మిషన్ ఉంది.. ట్రోలర్స్‌కు ఇచ్చిపడేసిన త్రిష
Trisha
Rajeev Rayala
|

Updated on: Jun 02, 2026 | 9:06 PM

Share

అందాల భామ త్రిష.. కెరీర్ మొదట్లో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన త్రిష.. ఆ తర్వాత హీరోయిన్ గా మారింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన వర్షం సినిమాతో తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ మూవీతో త్రిష జీవితం ఒక్కసారిగా మలుపు తిప్పింది. సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక క్రేజ్ సొంతం చేసుకుంది. వర్షం సినిమా తర్వాత దక్షిణాదిలో ఆమెకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. మెగాస్టార్ చిరంజీవి, ఎన్టీఆర్, ప్రభాస్, మోహన్ లాల్, అజిత్, సూర్య, విజయ్ దళపతి వంటి స్టార్ హీరోలతో కలిసి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించింది. సినీరంగంలోకి త్రిష అడుగుపెట్టి 20 సంవత్సరాలు దాటినప్పటికీ ఇప్పటికీ ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు.

దాదాపు రెండు దశాబ్దాలకు పైగా అందం, అభినయంతో సినీ పరిశ్రమను ఏలేస్తోంది. తెలుగుతోపాటు తమిళం, మలయాళం భాషలలో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంటూ ఇప్పటికీ టాప్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. ఓవైపు ఆమె నటించిన చిత్రాన్ని భారీ విజయాన్ని అందుకుంటున్నా.. పలు కారణాలతో నిత్యం వార్తలలో ఉంటుంది త్రిష. ఇటీవల దళపతి విజయ్ తో త్రిష రిలేషన్ లో ఉందంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. దళపతి విజయ్ ఇటీవలే తమిళనాడు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.. అయితే విజయ్ భార్య విడాకులు కోరుతూ విజయ్ పై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే..

నటితో విజయ్ కు ఎఫైర్ ఉందని ఆమె ఆరోపించింది. అదే సమయంలో విజయ్ తో త్రిష ఎక్కువగా కనిపించడంతో ఈ ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ పెద్దెత్తున ప్రచారం జరుగుతుంది. విజయ్ ప్రమాణస్వీకారం త్రిష కనిపించడం.. అలాగే ఇటీవల హీరో అజిత్ తల్లి చనిపోయినప్పుడు పరామర్శించడానికి త్రిషతో కలిసి వెళ్ళాడు సీఎం విజయ్. దాంతో మరిన్ని ఊహాగానాలు పుట్టుకొచ్చాయి..దాంతో త్రిష పై పలు ట్రోల్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఆ ట్రోల్స్ కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది త్రిష. తన పెట్ డాగ్ ఫోటో షేర్ చేస్తూ.. తన వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవడానికి కేవలం ఈ మూగజీవానికి మాత్రమే పర్మిషన్ ఉందంటూ ఆమె రాసుకొచ్చారు. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

View this post on Instagram

A post shared by Trish (@trishakrishnan)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us