AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TG SET 2026: టీజీ సెట్ దరఖాస్తులు ప్రారంభం.. చివరి తేదీ ఎప్పుడంటే? ఎడిట్ ఆప్షన్, హాల్ టికెట్ వివరాలు ఇవే!

TG SET Notification 2026: తెలంగాణలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలను లక్ష్యంగా పెట్టుకున్న అభ్యర్థులకు శుభవార్త. TG SET-2026 నోటిఫికేషన్ విడుదల కాగా, ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. అర్హతలు, దరఖాస్తు ఫీజు, పరీక్ష తేదీలు, ముఖ్యమైన సూచనలతో పూర్తి వివరాలను తెలుసుకోండి.

TG SET 2026: టీజీ సెట్ దరఖాస్తులు ప్రారంభం.. చివరి తేదీ ఎప్పుడంటే? ఎడిట్ ఆప్షన్, హాల్ టికెట్ వివరాలు ఇవే!
Tg Set Notification 2026
Rajashekher G
|

Updated on: Aug 03, 2026 | 11:49 PM

Share

తెలంగాణలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలను లక్ష్యంగా పెట్టుకున్న అభ్యర్థులకు శుభవార్త. తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TG SET)-2026కు సంబంధించిన దరఖాస్తుల షెడ్యూల్‌ను ఉస్మానియా యూనివర్సిటీ విడుదల చేసింది. ఆగస్టు 3, 2026 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. అభ్యర్థులు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఆగస్టు 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆలస్య రుసుముతో కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. హాల్ టికెట్లు సెప్టెంబర్ 22 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్షలను సెప్టెంబర్ చివరి వారంలో నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

ముఖ్యమైన తేదీలు

  • ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: 03-08-2026
  • ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చివరి తేదీ: 30-08-2026
  • రూ.1,500 ఆలస్య రుసుముతో: 31-08-2026 నుంచి 05-09-2026 వరకు
  • రూ.2,000 ఆలస్య రుసుముతో: 06-09-2026 నుంచి 10-09-2026 వరకు
  • రూ.3,000 ఆలస్య రుసుముతో: 11-09-2026 నుంచి 12-09-2026 వరకు
  • దరఖాస్తులో మార్పులు (Edit Option): 13-09-2026 నుంచి 15-09-2026 వరకు
  • హాల్ టికెట్ల డౌన్‌లోడ్: 22-09-2026
  • పరీక్షలు: 2026 సెప్టెంబర్ చివరి వారం

TG SET అంటే ఏమిటి?

TG SET (Telangana State Eligibility Test) అనేది తెలంగాణలోని విశ్వవిద్యాలయాలు, డిగ్రీ కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అర్హతను నిర్ధారించే రాష్ట్రస్థాయి పరీక్ష. ఈ పరీక్షను ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహిస్తోంది.

అభ్యర్థులకు సూచనలు

దరఖాస్తు చేసుకునే ముందు అధికారిక నోటిఫికేషన్‌ను పూర్తిగా చదివి అర్హతలు, పరీక్ష విధానం, సిలబస్, ఫీజు తదితర వివరాలను పరిశీలించాలని అధికారులు సూచించారు. చివరి తేదీల్లో సాంకేతిక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉన్నందున వీలైనంత త్వరగా దరఖాస్తు పూర్తి చేయడం మంచిదని తెలిపారు.

(Note: ఈ కథనంలోని తేదీలు అధికారిక TG SET-2026 ప్రెస్ నోట్ ఆధారంగా ఇవ్వబడ్డాయి. అర్హతలు, ఫీజు, సిలబస్, పరీక్ష తేదీలకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో అందుబాటులో ఉంటాయి.)

టీజీ సెట్ నోటిఫికేషన్, దరఖాస్తులకు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us