ఇప్పటి వరకు సీత పాత్రలో నటించిన హీరోయిన్స్ వీరే!

Samatha

3 August 2026

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ శ్రీరాముడి పాత్రలో, నటి సాయిపల్లవి సీత పాత్రలో నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం రామాయణం.

రీ సెంట్‌గా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే దీంతో అనేక వార్తలు వైరల్ అవుతున్నాయి. అలాగే ఇప్పటి వరకు సీతగా చేసిన హీరోయిన్స్ పేరు కూడా నెట్టింట వైరల్‌గా మారింది.

కాగా, ఇప్పుడు మనం ఇప్పటి వరకు తెలుగు  వెండితెరపై, సీతగా నటించిన ముద్దుగుమ్మలు ఎవరో, సీత పాత్రలో నటించి మెప్పించిన వారు ఎవరో చూద్దాం.

జయప్రద, బాపు దర్శకత్వంలో తెరకెక్కిన సీతా కళ్యాణం మూవీలో సీత పాత్రలో నటించి, తన అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకుంది.

లవ కుశ మూవీలో సీతగా నటించి మెప్పించిన అలనాటి తార, అంజలీ దేవి, సీత పాత్రలో తన అద్భుతమైన నటతో తెలుగు వారి గుండెల్లో నిలిచి పోయింది.

అర్చన, అక్కినేని నాగార్జున నటించి, రామదాసు మూవీలో అర్చన సీత పాత్రలో నటించింది. తన నటనతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది.

నయనతార, నందమూరి బాలకృష్ణ కాంబోలో వచ్చిన సినిమా శ్రీరామ రాజ్యం ఈ మూవీలో నయనతార సీతగా నటించి, తన అద్భుతమైన నటనతో తెలుగు అభిమానులను ఆకట్టుకుంది.

కృతి సనన్, ఆదిపురుష్ మూవీలో సీతగా, జానకిగా నటించి మెప్పించింది. ఈ బ్యూటీ తన అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకుంది.