AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ అడిగితే ప్రాణమిస్తా.. ఆయన జోలికొస్తే ప్రాణం తీస్తా.. జబర్దస్త్ కమెడియన్ వార్నింగ్

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన అభిమాన గణంలో సామాన్యులే కాదు పలువురు యంగ్ హీరోలు, ఇతర సినీ ప్రముఖులు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ అంటే పడి చచ్చే ఒక జబర్దస్త్ కమెడియన్ తారక్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.

Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ అడిగితే ప్రాణమిస్తా.. ఆయన జోలికొస్తే ప్రాణం తీస్తా.. జబర్దస్త్ కమెడియన్ వార్నింగ్
Jr NTR
Basha Shek
|

Updated on: Aug 03, 2026 | 9:51 PM

Share

గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ ప్రస్తుతం డ్రాగన్ సినిమా షూటింగ్ పనుల్లో బిజీగా ఉంటున్నారు. కేజీఎఫ్, సలార్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే వివిధ భాషలకు చెందిన స్టార్స్ కూడా ఈ మూవీలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ క్రేజ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇప్పుడు ఆయనకు వరల్డ్ వైడ్ పాపులారిటీ ఉంది. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ తర్వాత ఆయన పాపులారిటీ అమాంతం పెరిగిపోయింది. గ్లోబల్ స్టార్ గా ఎదిగిపోయిన తారక్ కు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అందులో సామాన్యులే కాదు యంగ్ హీరోలు, పలువురు సినీ ప్రముఖులు ఉన్నారు. అలా జూనియర్ ఎన్టీఆర్ ను పిచ్చి పిచ్చిగా అభిమానించే వారిలో జబర్దస్త్ కమెడియన్ కారు మంచి రఘు అలియాస్ రోలర్ రఘు కూడా ఉన్నారు. ఎన్టీఆర్ హీరోగా నటించిన ఆది, అదుర్స్, , ఊసరవెల్లి , బృందావనం, రభస, టెంపర్ వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి నవ్వించారు రఘు. ఓవరాల్ గా రూ. 150 కు పైగా సినిమాలు చేసిన ఆయన జబర్దస్త్ లోనూ మెరిశారు. సాధారణ కంటెస్టెంట్ గా మొదలెట్టి టీమ్ లీడర్ దాకా ఎదిగారు.

అయితే ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు రఘు. అప్పుడప్పుడు మాత్రమే వెండితెర, బుల్లితెరపై కనిపిస్తున్నారాయన. కాగా పలు సందర్భాల్లో ఎన్టీఆర్ పట్ల తన అభిమానాన్ని చాటుకున్నారు రఘు. ‘జూనియర్ ఎన్టీఆర్ అంటే నాకు చాలా ఇష్టం. ఎన్టీఆర్ ఏది చేయమన్నా నేను రెడీగా ఉన్నాను. ఆయన కోసం ఏం చేయడానికైనా వెనకాడను. నా బాడీలో ఆయనొక పార్ట్‌గా మిగిలిపోయారు. ఆయన నన్నెప్పుడు పెద్దన్న అని పిలిచేవారు. మేం ఎప్పుడు కలవలేదు అనుకుంటారు. మేం కలిశామని పబ్లిక్‌కు ఎందుకు తెలియాలి’ అని రఘు గతంలో చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

ఇక రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూకు హాజరైన రఘు .. ‘జూనియర్ ఎన్టీఆర్ కోసం ప్రాణాలు ఇవ్వడమే కాదు , ప్రాణాలు కూడా తీసేస్తా’ అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. అప్పుడు యాంకర్ నిజమా అని అడిగితే ‘ నిజం భాయ్, ఎవరైనా ఆయన మీద కామెంట్ చేసినట్టు చెప్పి నా దగ్గరకి తీసుకొని రా , 24 గంటల్లోనే పని పూర్తి చేస్తా, అసలే మాది హైదరాబాద్’ అని నవ్వుతూ చెప్పుకొచ్చారు రఘు.

ఫ్యామిలీతో టాలీవుడ్ కమెడియన్ రఘు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us