Rangam Bhavishyavani LIVE: ఈ ఏడాది ఎలా ఉండనుంది..? మహంకాళి రంగం భవిష్యవాణి ప్రత్యక్ష ప్రసారం..
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల్లో అత్యంత కీలకమైన రంగం (భవిష్యవాణి) కార్యక్రమం సోమవారం ఘనంగా ప్రారంభమైంది. మాతంగి స్వర్ణలత అమ్మవారిని ఆవాహన చేసి రాబోయే ఏడాదికి సంబంధించిన వర్షాలు, పంటలు, ప్రజల సంక్షేమంపై భవిష్యవాణి వినిపించనున్నారు. రంగం అనంతరం అమ్మవారి చిత్రపటంతో అంబారీ ఊరేగింపు జరగనుండగా, ఉత్సవాల సందర్భంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.
హైదరాబాద్ మహానగరంలో ఎక్కడ చూసినా బోనాల సందడే కనిపిస్తోంది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారికి ముక్కులు చెల్లించుకున్నారు. లష్కర్ బోనాల ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు సోమవారం రంగం భవిష్యవాణి ప్రారంభమైంది. వాస్తవానికి.. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం బోనాల జాతరలో రెండో రోజు జరిగే రంగం (భవిష్యవాణి) అత్యంత ముఖ్యమైన సాంప్రదాయ ఘట్టం.. దీనిలో మాతంగి స్వర్ణలత పచ్చి మట్టి కుండపై నిలబడి అమ్మవారిని ఆవాహన చేసుకుని రాబోయే ఏడాదికి సంబంధించిన భవిష్యవాణిని వినిపిస్తారు. రాబోయే ఏడాది కాలంలో రాష్ట్రంలో వర్షపాతం, పంటలు, ప్రజల ఆరోగ్య పరిస్థితులు, అలాగే అమ్మవారికి సమర్పించిన బోనాలు, పూజలపై ఆమె రంగంలో వినిపించనున్నారు. భవిష్యవాణి కార్యక్రమం అనంతరం అంబారీపై అమ్మవారి చిత్రపటంతో భారీ ఊరేగింపు నిర్వహిస్తారు. రంగంతోపాటు.. ఊరేగింపు కార్యక్రమం దృష్ట్యా అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.
ఒకటే వేట.. లక్షల్లో పంట.. జాలరి వలలో భారీ చేపలు
పగలు అపర భక్తులు.. రాత్రయితే వీళ్ల అసలు స్వరూపం ఇది!
ఘాట్రోడ్లో తిష్టవేసిన చిరుత.. భయంతో వణికిపోతున్న వాహనదారులు!
ఇంట్లోనుంచి వింత శబ్దాలు.. వెళ్లి చూడగా.. గుండె జారిపోయే ఘటన
గణపతి విగ్రహం కొంటున్నారా.. ఎలాంటి విగ్రహం కొనాలో తెలుసా?
రీల్స్ చూస్తుండగా సిగ్నల్ కట్.. మనస్తాపంతో మహిళ ఆత్మహత్య!
ఏఐ రెట్రో లుక్స్‌తో అదరగొడుతున్న సెలబ్రిటీలు!
