AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈబీ-5 గ్రీన్‌కార్డు ఫీజులపై ‘డబుల్‌’ షాక్‌.. భారతీయులపై ఎఫెక్ట్‌

ఈబీ-5 గ్రీన్‌కార్డు ఫీజులపై ‘డబుల్‌’ షాక్‌.. భారతీయులపై ఎఫెక్ట్‌

Phani CH
|

Updated on: Oct 02, 2026 | 5:09 PM

Share

అమెరికాలో పెట్టుబడి ద్వారా గ్రీన్‌కార్డ్‌ పొందాలని చూస్తున్న విదేశీ ఇన్వెస్టర్లకు కొత్త ఫీజుల భారం పెరగనుంది. EB-5 ప్రోగ్రామ్‌లోని పలు దరఖాస్తుల రుసుములను USCIS భారీగా పెంచింది. I-526, I-526E, I-829, I-956F వంటి ఫారమ్‌లకు కొత్త ఫీజులు నవంబర్‌ 30 నుంచి అమల్లోకి రానున్నాయి. ముఖ్యంగా I-956F ఫీజు భారీగా పెరగడం గమనార్హం. అమెరికాలో పెట్టుబడి పెట్టాలనుకునే భారతీయ ఇన్వెస్టర్లపై కూడా ఈ మార్పు ప్రభావం చూపే అవకాశం ఉంది.

అమెరికాలో శాశ్వత నివాసం కోరుకునే విదేశీ ఇన్వెస్టర్లకు అమెరికా ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. పెట్టుబడి ఆధారిత ఈబీ-5 గ్రీన్‌కార్డ్ దరఖాస్తు ఫీజులను భారీగా పెంచుతూ యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ కీలక నిర్ణయం తీసుకుంది. కొన్ని రకాల దరఖాస్తు రుసుములు ఏకంగా రెట్టింపు కంటే ఎక్కువ కావడం గమనార్హం. ఈ కొత్త ఫీజుల నిబంధనలు నవంబరు 30 నుంచి అమల్లోకి రానున్నాయి. దరఖాస్తుల సమీక్ష, బ్యాక్‌గ్రౌండ్ తనిఖీలు, అర్హత ధ్రువీకరణ, మోసాలను అరికట్టేందుకు అయ్యే ఖర్చులను భరించేందుకే ఈ ఫీజులు పెంచినట్లు USCIS తెలిపింది. స్టాండ్‌ఎలోన్‌ ఇన్వెస్టర్లు ధరఖాస్తు చేసుకునే I-526 ఫామ్‌ ఫీజును 3,675 డాలర్ల నుంచి 7,615 డాలర్లకు పెంచనున్నారు. గుర్తింపు పొందిన రీజినల్ సెంటర్‌ ద్వారా పెట్టుబడులు పెట్టే విదేశీయులు ఉపయోగించుకునే I-526E దరఖాస్తు రుసుము 3,675 డాలర్ల నుంచి 7,850 డాలర్లకు పెరగనుంది. దీనికి 75 డాలర్ల టెక్నాలజీ ఫీజు అదనం. తమ శాశ్వత నివాస హోదాపై ఉన్న షరతులను తొలగించాలని కోరుతూ పెట్టుబడిదారులు దాఖలు చేసే I-829 దరఖాస్తు ఫీజును 3,750 డాలర్ల నుంచి 5,000 డాలర్లకు పెంచనున్నారు. అమెరికా వాణిజ్య సంస్థల్లో పెట్టుబడికి ఆమోదం కోరుతూ దరఖాస్తు చేసే I-956F ఫామ్‌ ఫీజు ధర 17,795 డాలర్ల నుంచి 42,675 డాలర్లకు పెరగనుంది. 1990లో ప్రారంభమైన ఈ ఈబీ-5 ప్రోగ్రామ్ కింద విదేశీ ఇన్వెస్టర్లు అమెరికా వ్యాపారాల్లో 1.05 మిలియన్ డాలర్లు లేదా మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో 8 లక్షల డాలర్లు పెట్టుబడి పెట్టి, కనీసం 10 మందికి ఉపాధి కల్పించాలి. దీనిద్వారా ఇన్వెస్టర్‌తో పాటు కుటుంబ సభ్యులకు గ్రీన్‌కార్డ్ లభిస్తుంది. గత దశాబ్దకాలంగా అమెరికా గ్రీన్‌కార్డ్ కోసం భారతీయుల నుంచి ఈ కేటగిరీలో డిమాండ్ భారీగా పెరిగింది. ఇప్పటికే కంట్రీ కోటా వల్ల సుదీర్ఘకాలం వేచి చూస్తున్న భారతీయ ఇన్వెస్టర్లకు, ఈ అదనపు ఫీజుల భారం గట్టి దెబ్బ కానుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మళ్లీ దగ్గరవుతోన్న భారత్‌-చైనా

ఉదయాన్నే మొక్కలకు నీళ్లు పోస్తున్న వ్యక్తి.. వెనుక ఏదో అలికిడి.. తిరిగి చూడగా గుండె గుభేల్‌

ఇక రైల్వే స్టేషనే పోలీస్‌ స్టేషన్‌.. ఏపీలో కొత్త సేవలు!

సినిమాకి వెళ్తే 22 నిమిషాలు యాడ్స్ వేస్తారా..? థియేటర్‌కు దిమ్మతిరిగే షాక్..

Baldness: బట్టతల చుట్టూ బోలెడు బిజినెస్! ఇది యాపారం భయ్యా!

Follow Us