అమలాపాల్ ఆడై సినిమాలో బోల్డ్‌గా నటించడంపై తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2019లో వచ్చిన ఆ సినిమా కోసం నగ్నంగా నటించిన ఆమె, కథ డిమాండ్ చేయడం వల్లే అప్పట్లో ఆ రిస్క్ తీసుకున్నానని తెలిపారు. అయితే ఇప్పుడు మాత్రం అలాంటి పాత్రలు వస్తే ఖచ్చితంగా తిరస్కరిస్తానని, వయసుతో పాటు పరిపక్వత పెరిగిందని ఆమె పేర్కొన్నారు.