EPFO: ఈపీఎఫ్ఓ భారీ గుడ్ న్యూస్.. 12 ఏళ్ల తర్వాత తొలిసారి.. కేంద్రం బిగ్ డెసిషన్..
దేశంలోని ప్రైవేట్ ఉద్యోగులకు శుభవార్త. అధిక జీతం పొందుతున్న కొంతమంది ఉద్యోగులు ఇప్పటివరకు వేతన పరిమితి నిబంధనల వల్ల పీఎఫ్ ప్రయోజనాలకు దూరం అవుతున్నారు. ఇప్పుడు వేతన పరిమితిని పెంచుతూ ఈపీఎఫ్ఓ నిర్ణయం తీసుకుంది. దీంతో లక్షలాది మంది ఉద్యోగులకు పీఎఫ్ ప్రయోజనాలు దక్కనున్నాయి.

Epfo
- ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఈపీఎఫ్ఓ వేతన పరిమితి పెంపుపై కీలక ప్రకటన చేసింది. వేతన పరిమితిని పెంచాలనే డిమాండ్లు ఎప్పటినుంచో వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఎట్టకేలకు దానిని లైన్ క్లియర్ అయింది. పీఎఫ్ బేసిక్ శాలరీ లిమిట్‌ను రూ.15 వేల నుంచి రూ.25 వేలకు పెంచాలనే ప్రతిపాదనలు ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఎట్టకేలకు దానికి ఆమోదం లభించింది.
- పీఎఫ్ వేతన పరిమితి లిమిట్‌ను రూ.15 వేల నుంచి రూ.25 వేలకు పెంచే ప్రతిపాదనకు కేంద్ర ఆర్ధికశాఖ ఆమోదం తెలిపింది. దీని వల్ల అదనంగా లక్షలాది మంది ఉద్యోగులకు పీఎఫ్ కవరేజీ లభించనుంది. ప్రైవేట్, సంఘటిత రంగంలో పనిచేస్తున్న లక్షలాది మంది ఉద్యోగులకు ఈ నిర్ణయంతో లబ్ది చేకూరనుంది. లక్షలాది మంది ఉద్యోగులకు అదనంగా పీఎఫ్ ప్రయోజనాలు లభించనున్నాయి.
- ఎన్నో దశాబ్దాలుగా వేతన పరిమితిని పెంచలేదు. చివరిగా 2014లో రూ.15 వేలకు పెంచారు. అప్పటివరకు రూ.6500గా ఉండగా.. రూ.15 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు దశాబ్దాల తర్వాత రూ.25 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీని వల్ల అదనంగా లక్షలాది ఉద్యోగులు పీఎఫ్ ఫండ్, పెన్షన్ పరిధిలోకి రానున్నారు. అయితే ఈ ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపాల్సి ఉంటుంది.
- కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపాక అమల్లోకి రానుంది. ఏ తేదీ నుంచి అమల్లోకి వస్తుందనేది ఈపీఎఫ్ఓ ప్రకటించనుంది. 2014 సెప్టెంబర్‌లో రూ.15 వేలకు పెంచారు. ఇప్పుడు 12 ఏళ్ల తర్వాత మళ్లీ పెంపు జరిగింది. ఇక నుంచి బేసిక్ పే+డీఏ కలిసి రూ.15 వేల కంటే ఎక్కువ ఉన్న ఉద్యోగులు కూడా పీఎఫ్ పరిధిలోకి వస్తారు. దీంతో ఉద్యోగుల జీతంతో పాటు పెన్షన్‌పై ప్రభావితం చూపనుంది.
- పీఎఫ్ కాంట్రిబ్యూషన్ ఇప్పటివరకు 12 శాతం పాత నిబంధన ప్రకారం గరిష్టంగా రూ.1800 జమ అయ్యేది. ఇప్పుడు రూ.3 వేలు జమ అవుతుంది. ఈపీఎస్ గతంలో రూ.1250 మాత్రమే జమ అయ్యేది. ఇప్పుడు రూ.2083కి పెరుగుతుంది. ఇక జీవిత బీమా ప్రస్తుతం రూ.7 లక్షలుగా ఉండగా.. ఇది కూడా పెరిగే ఛాన్స్ ఉంది. వీటి ప్రభావంతో టేక్ హోమ్ శాలరీ తగ్గే అవకాశముంది.
Follow Us





