వెంకీ సినిమా పై బోలెడన్ని ఆశలుపెట్టుకున్న కేజీఎఫ్ భామ  

3.  August   2026

Pic credit - Instagram

Rajeev 

మోడలింగ్ రంగం నుంచి సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది అందాల భామ శ్రీనిధి శెట్టి, స్వల్ప కాలంలోనే ప్యాన్-ఇండియా స్థాయిలో గుర్తింపు పొందింది.

2015లో మిస్ కర్ణాటక టైటిల్ గెలుచుకుంది. 2016లో జరిగిన మిస్ సుప్రానేషనల్  అంతర్జాతీయ అందాల పోటీలో విజేతగా నిలిచింది.

దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కన్నడ బ్లాక్‌బస్టర్ సినిమా కేజీఎఫ్ 1 ద్వారా రీనా దేశాయ్ పాత్రలో పరిచయమైంది.

2022లో వచ్చిన కేజీఎఫ్ 2 అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచి ఆమె క్రేజ్‌ను మరింత పెంచింది.

కోలీవుడ్ వర్సటైల్ యాక్టర్ విక్రమ్ సరసన 'కోబ్రా' సినిమాతో తమిళ చిత్రసీమలోకి అడుగుపెట్టింది. తెలుగులోనూ సినిమాలు చేసింది.

తెలుగులో హిట్ 3, తెలుసు కదా సినిమాలు చేసి మెప్పించింది. కానీ తెలుగులో పెద్దగా ఆఫర్స్ అందుకోలేకపోతుంది ఈ చిన్నది.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను కవ్వుస్తుంది ఈ వయ్యారి భామ.