క్యూట్ నెస్ తో కట్టిపడేస్తున్న కుర్ర భామ వర్ష బొల్లమ్మ 

3  August   2026

Pic credit - Instagram

Rajeev 

2015లో విడుదలైన తమిళ చిత్రం సతురాన్ ద్వారా వర్ష బొల్లమ్మ సినీ రంగంలోకి అడుగుపెట్టింది.  తొలి చిత్రంతోనే ఆమె సహజ నటనకు మంచి ప్రశంసలు దక్కాయి.

అనంతరం వెట్రివేల్, యానుం తీయవన్ వంటి చిత్రాల్లో నటిస్తూ తమిళ చిత్ర పరిశ్రమలో తనకంటూ గుర్తింపు ఏర్పరుచుకుంది.

2018లో విడుదలైన 96 సినిమాలో ఆమె పోషించిన పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంది. అదే ఏడాది వచ్చిన "కళ్యాణం" సినిమాతో హీరోయిన్‌గా మరింత గుర్తింపు పొందింది.

అనంతరం విజయ్ నటించిన భారీ చిత్రం బిగిల్ లో కీలక పాత్ర పోషించి తన కెరీర్‌లో మరో ముఖ్యమైన మైలురాయిని చేరుకుంది.

తెలుగులో వర్ష బొల్లమ్మకు మంచి గుర్తింపు తీసుకొచ్చిన చిత్రం చూసి చూడంగానే. ఆ తర్వాత ఆనంద్ దేవరకొండతో కలిసి నటించిన మిడిల్ క్లాస్ మెలోడీస్ హిట్ అయ్యింది.

తర్వాత స్వాతి ముత్యం, "స్టాండ్ అప్ రాహుల్" చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించింది. 2024లో విడుదలైన "ఊరు పేరు భైరవకోన" సినిమాలో కూడా తన నటనతో ఆకట్టుకుంది.

2025లో వచ్చిన "తమ్ముడు" చిత్రంలో నటించి మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించింది. నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేస్తూ హిట్స్ అందుకుంటుంది.