ఇమేజ్ మార్చినా హిట్ లేదు.. హీరోయిన్ల కొత్త ప్రయోగాలకు ఎందుకు బ్రేక్ పడుతోంది?
ఒకే తరహా పాత్రల నుంచి బయటపడేందుకు కథానాయికలు కొత్త జానర్లలో ప్రయోగాలు చేస్తున్నారు. మృణాల్ ఠాకూర్, నభా నటేష్, రష్మిక మందన్న వంటి హీరోయిన్లు భిన్నమైన పాత్రల్లో కనిపించినప్పటికీ ఆశించిన విజయాలు మాత్రం అందుకోలేకపోయారు. ఇమేజ్ మారినా బాక్సాఫీస్ సక్సెస్ మాత్రం అంత సులభం కాదని తాజా పరిణామాలు చెబుతున్నాయి.
ఇన్నాళ్లు ఒకే రకమైన ఇమేజ్‌తో కెరీర్ నెట్టుకొచ్చిన బ్యూటీస్ ఇప్పుడు కొత్తగా థింక్ చేస్తున్నారు. ప్రజెంట్ సిల్వర్ స్క్రీన్ మీద ఉన్న కాంపిటీషన్‌లో సంథింక్ స్పెషల్ అనిపించుకోవాలంటే డిఫరెంట్ జానర్స్ టచ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. అందుకే ఇమేజ్ బారియర్స్‌ను బ్రేక్ చేసి కొత్తగా థింక్ చేస్తున్నారు. అయితే ఈ ప్రయత్నాలు అందాల భామలకు పెద్దగా వర్కవుట్ అవుతున్నట్టుగా కనిపించటం లేదు. సీతారామమ్ సినిమా తరువాత మృణాల్ ఠాకూర్‌ను మరో లుక్‌లో ఎవరూ ఊహించలేకపోయారు. అందుకే బాలీవుడ్‌లో గ్లామర్ రోల్స్ చేస్తున్నా.. సౌత్‌లో మాత్రం ఈ బ్యూటీకి హోమ్‌లీ క్యారెక్టర్స్ మాత్రమే ఇచ్చారు మన మేకర్స్. రీసెంట్‌గా ఆ ఇమేజ్‌ను బ్రేక్ చేసిన మృణాల్, డెకాయిట్ సినిమాలో ఛాలెంజింగ్ రోల్‌లో కనిపించారు. థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో మృణాల్ యాక్షన్ సీన్స్‌లోనూ నటించినా.. సక్సెస్ మాత్రం రాలేదు. కెరీర్ స్టార్టింగ్‌లో ఎక్కువగా గ్లామర్ రోల్స్ చేసిన నభా నటేష్ కూడా ఇప్పుడు కొత్తగా ట్రై చేశారు. గ్లామర్ ఇమేజ్‌ను పక్కన పెట్టి డివోషనల్ మూవీ నాగబంధంలో ఇంట్రస్టింగ్ క్యారెక్టర్‌లో నటించారు. ఈ సినిమాతో నభాకి డిఫరెంట్ వేరియేషన్స్ చూపించే ఛాన్స్ వచ్చినా… సక్సెస్ మాత్రం రాలేదు. వరుసగా పెర్ఫామెన్స్ ఓరియంటెడ్ మూవీసే చేస్తున్న రష్మిక మందన్న కూడా రీసెంట్‌గా ఓ బాలీవుడ్ మూవీతో ఇమేజ్ మార్చుకునే ప్రయత్నం చేశారు. కాక్‌టైల్ 2లో బోల్డ్ అండ్ బ్యూటీఫుల్ గర్ల్‌గా కనిపించారు నేషనల్ క్రష్. అయితే ఈ సినిమా, రష్మికకు గ్లామర్ ఇమేజ్ తెచ్చిపెట్టినా సక్సెస్ మాత్రం ఇవ్వలేదు. దీంతో అందాల భామలు జానర్ షిప్ట్ చేస్తే ఇమేజ్ మారినా.. సక్సెస్ మాత్రం దక్కటం కష్టమే అంటున్నారు ఇండస్ట్రీ జనాలు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వామ్మో భూమిపైనే కాదు.. అంతరిక్షంలోనూ ఇంత చెత్త ఉందా!
స్కూటీలో భారీ పాము..భయంతో జనం పరుగులు
OTT కొత్త రూల్స్.. నిర్మాతలకు వరమా? శాపమా?
పుర్రె తెరవకుండానే బ్రెయిన్ సర్జరీ.. భారత సంతతి డాక్టర్ అద్భుతం!
Chicken Manchurian: మంచూరియా చైనా వంటకం కాదు.. మన ఇండియాదే.. ఏ ఊరిదో తెలుసా?
వామ్మో భూమిపైనే కాదు.. అంతరిక్షంలోనూ ఇంత చెత్త ఉందా!
స్కూటీలో భారీ పాము..భయంతో జనం పరుగులు
పుర్రె తెరవకుండానే బ్రెయిన్ సర్జరీ.. భారత సంతతి డాక్టర్ అద్భుతం!
మంచూరియా చైనా వంటకం కాదు.. మన ఇండియాదే..
లేడీ ఏసీపీ సాహసం... కదులుతున్న బస్సుకు ఎదురుగా నిలబడి
ఆహా స్కెచ్ అంటే నీదే బాస్.. అప్పు తీర్చడానికి ఏం ప్లాన్ చేసాడు
భాగ్యనగరంలో బోనాల సందడి.. వెయ్యేళ్ల ఆచారం..

