బుల్లితెర క్రేజీ బ్యూటీ కావ్య శ్రీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ ముద్దుగుమ్మ అందానికి ఎవ్వరైనా సరే ఫిదా అవ్వాల్సిందే.
బిగ్ బాస్ సీజన్ 8 తర్వాత ఈ బ్యూటీ చాలా ఫేమస్ అయ్యింది. ఇప్పటికీ అదే క్రేజ్ కొనసాగుతుంది. తన అందంతో కుర్రకారు మనసు దోచేస్తుంది.
మరీ ముఖ్యంగా ఈ మధ్య కావ్య శ్రీ బిగ్ బాస్ హౌజ్‌లోకి వెళ్లనున్నట్లు గుస గుసలు వినిపిస్తున్నాయి. ఈ బ్యూటీ తెలుగు బిగ్ బాస్ కంటెస్టెట్ లిస్ట్‌లో ఉన్నట్లు వార్తలు వైరల్ అవున్నాయి.
ఇక గోరింటాకు సీరియల్ ద్వారా తెలుగు బెల్లితెరపైకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ, తర్వాత కోయిలమ్మ, గువ్వా గోరింక వంటి పలు సినిమాల్లో నటిస్తూ మంచి ఫేమ్ సంపాదించుకుంది.
సీరియల్‌లో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ చిన్నది, సీరియల్ నటుడు, నిఖిల్‌తో ప్రేమాయణం వలన మరింత క్రేజ్ సొంతం చేసుకుంది.
కొన్ని రోజుల పాటు ప్రేమలో ఉన్న ఈ ముద్దుగుమ్మ , తర్వాత మనస్పర్థల కారణంగా బ్రేకప్ చెప్పి విడిపోయింది. బిగ్ బాస్ హౌజ్‌లో నిఖిల్ తన పేరు తీయడం, ప్రేమ గురించి మాట్లాడటంతో కావ్య చాలా వైరల్ అయ్యింది.
దీని తర్వాత పలు షోలలో యాంకర్‌గా చేస్తూ, తన అందం, అల్లరితనంతో సందడి చేస్తూ ఫుల్ బిజీగా గడిపేస్తుంది. అందరి మనసు దోచేస్తుంది.
తాజాగా ఈబ్యూటీ రెడ్ కలర్ డ్రెస్‌లో ఉన్న క్యూట్ ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఇవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.