AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ramayana Vs Adipurush: ట్రైలర్ వ్యూస్‌లోనూ ప్రభాస్ హవా.. ‘రామాయణ’కూ అందని రికార్డులు!

Ramayana Vs Adipurush: ట్రైలర్ వ్యూస్‌లోనూ ప్రభాస్ హవా.. ‘రామాయణ’కూ అందని రికార్డులు!

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Aug 03, 2026 | 8:32 AM

Share

పాన్ ఇండియా సినిమాల మధ్య ట్రైలర్ వ్యూస్ పరంగా రికార్డుల పోటీ కొనసాగుతోంది. రణ్‌బీర్ కపూర్, యశ్ నటించిన ‘రామాయణ’ ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చినా, 24 గంటల వ్యూస్‌లో ప్రభాస్ ‘ఆదిపురుష్’ రికార్డును అధిగమించలేకపోయింది. ‘సలార్’, ‘ఆదిపురుష్’తో ప్రభాస్ ఇప్పటికీ ట్రైలర్ వ్యూస్ రికార్డుల్లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారని సినీ వర్గాలు చర్చిస్తున్నాయి.

సినిమాల మధ్యే కాదు ఇప్పుడు ట్రైలర్ వ్యూస్ విషయంలోనూ నెంబర్‌ గేమ్ నడుస్తోంది. ముఖ్యంగా పాన్ ఇండియా రేంజ్‌లో ఇండియన్ సినిమాను షేక్ చేసే రికార్డుల వేట మొదలైంది. మరి భారీ క్యాస్టింగ్‌తో వస్తున్న బాలీవుడ్ మల్టీస్టారర్స్ ఏ రేంజ్‌లో రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి? నెంబర్‌ గేమ్‌లో ప్రభాస్ క్రేజ్‌ను వెనక్కినెట్టే సత్తా ఏ సినిమాకైనా ఉందా..? పాన్ ఇండియా స్క్రీన్‌ మీద భారీ విజువల్ వండర్‌గా తెరకెక్కుతున్న సినిమా ‘రామాయణ’. రణ్‌బీర్ కపూర్ రాముడిగా, రాకింగ్ స్టార్ యశ్ రావణుడిగా నటిస్తున్న ఈ మూవీ ట్రైలర్ రీసెంట్‌గా రిలీజై సెన్సేషన్ క్రియేట్ చేసింది. అత్యద్భుతమైన వీఎఫ్ఎక్స్‌, భారీ స్కేల్‌లో నితీశ్ తివారీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్న తీరుకు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. అయితే ట్రైలర్‌కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా.. రికార్డుల విషయంలో మాత్రం ప్రభాస్‌ ఆదిపురుష్ మూవీని బీట్ చేయలేకపోయింది ఆదిపురుష్‌. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించిన ‘ఆదిపురుష్’ మూవీ ట్రైలర్ క్రియేట్ చేసిన రికార్డ్స్‌కు ‘రామాయణ’ ట్రైలర్‌ చాలా దూరంలో ఆగిపోయింది. ఆదిపురుష్ ట్రైలర్ 24 గంటల్లో 74.2 మిలియన్ల వ్యూస్ రాబట్టి ఆల్ టైమ్ ఫోర్త్ ప్లేస్‌లో నిలిచింది. కానీ అంతకు మించిన పాజిటివ్ బజ్ తెచ్చుకున్న ‘రామాయణ’ ట్రైలర్ మాత్రం 24 గంటల్లో అన్ని భాషల్లో కలిపి 45 మిలియన్ల వ్యూస్ మాత్రమే రాబట్టింది. ట్రెండింగ్‌లో ఉన్నా కూడా టాప్ 20 లిస్ట్‌లో 19వ స్థానంతోనే సరిపెట్టుకుంది. ఆదిపురుష్ సినిమాకు ఆడియన్స్ నుంచి మిక్స్‌డ్ టాక్ వచ్చినా.. కేవలం ప్రభాస్ ఉన్నాడన్న ఒకే ఒక కారణంతో ట్రైలర్‌కు ఆ రేంజ్ వ్యూస్ వచ్చాయి. నేషనల్ మార్కెట్‌లో డార్లింగ్ డామినేషన్‌ను ఇది మరోసారి ప్రూవ్ చేసింది. ప్రభాస్ మాస్ ఫాలోయింగ్‌ ముందు భారీ కాస్టింగ్, అద్భుతమైన మేకింగ్ కూడా పనిచేయలేదు. ఓవరాల్‌గా 24 గంటల్లో అత్యధిక వ్యూస్ సాధించిన ఇండియన్ సినిమా ట్రైలర్స్ లిస్ట్ లోనూ ప్రభాస్ డామినేషనే కనిపిస్తుంది. టాప్ 3లో ‘సలార్’ 113.2 మిలియన్ వ్యూస్‌తో నెంబర్ వన్ ప్లేస్‌లో ఉంటే.. కేజీఎఫ్ 2, పుష్ప 2 నెక్స్ట్ ప్లేసెస్‌లో ఉన్నాయి. ఆదిపురుష్‌తో నాలుగో ప్లేస్‌ను కూడా ఆక్యుపై చేశారు డార్లింగ్‌.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వామ్మో భూమిపైనే కాదు.. అంతరిక్షంలోనూ ఇంత చెత్త ఉందా!

స్కూటీలో భారీ పాము..భయంతో జనం పరుగులు

OTT కొత్త రూల్స్.. నిర్మాతలకు వరమా? శాపమా?

పుర్రె తెరవకుండానే బ్రెయిన్ సర్జరీ.. భారత సంతతి డాక్టర్ అద్భుతం!

Chicken Manchurian: మంచూరియా చైనా వంటకం కాదు.. మన ఇండియాదే.. ఏ ఊరిదో తెలుసా?

Follow Us