ఉద్యోగ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించినా గర్భవతి అయినందున శారీరక పరీక్ష వాయిదాకు నిరాకరించిన సబార్డినేట్ సర్వీసెస్ సెలెక్షన్ కమిషన్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ యూపీకి చెందిన కోమల్ జైస్వాల్ హైకోర్టును ఆశ్రయించారు. ఆమెకు అనుకూలంగా తీర్పునిచ్చిన హైకోర్టు, డెలివరీ తర్వాత పరీక్ష నిర్వహించాలని ఆదేశించింది. ఇది ఎందరికో ఆనందాన్ని పంచుతోంది.