AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వేలకోట్ల బడ్జెట్‌.. వందల కొద్దీ వివాదాలు.. రామాయణంపై వచ్చే స్క్రీన్‌ప్లేలన్నీ తిరగబడుతున్నాయా?

నిద్రపుచ్చడానికి బామ్మ చెప్పే కథలూ లేవు. వీధిచివర గుళ్లలో జరిగే పురాణ పఠనాలూ లేవు. చందమామ పుస్తకాలున్నా చదివే ఓపిక అసలే లేదు. ఉంటేగింటే సినిమా.. లేదంటే సోషల్ మీడియా. మరి, రామాయణ- మహాభారతం లాంటి గొప్పగొప్ప ఇతిహాసాలను తర్వాతి తరాలకు క్యారీ ఫార్వర్డ్ చెయ్యాలంటే సినిమా ఒక్కటేగా మార్గం? ఆ ఏకైక మాధ్యమాన్ని, పవర్‌ఫుల్ మీడియాను కూడా మిస్‌యూజ్ చేస్తే? క్రియేటివ్ ఫ్రీడమ్ పేరుతో గొప్పగొప్ప ఇతిహాసాల్ని కూడా అపహాస్యం చేస్తే? ఎస్‌.. హైందవసమాజంలో ఇదే ఇప్పుడు పెద్ద ఫికరైపోయింది. రామాయణంపై వచ్చే స్క్రీన్‌ప్లేలన్నీ తిరగబడుతున్నాయా? భక్తకోటి మనోభావాల్ని దెబ్బతీస్తున్నాయా? ప్రేక్షకుల మనస్సుల్లో ఉన్నదేంటో చూద్దాం పదండి.

వేలకోట్ల బడ్జెట్‌.. వందల కొద్దీ వివాదాలు.. రామాయణంపై వచ్చే స్క్రీన్‌ప్లేలన్నీ తిరగబడుతున్నాయా?
Ramayana Movie Controversy
Anand T
|

Updated on: Aug 03, 2026 | 9:56 PM

Share

బాలీవుడ్ ఏస్ డైరెక్టర్ నితేష్ తివారీ తాజా క్రియేటివ్ వెంచర్ రామాయణ. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద వన్ మోర్ బిగ్గెస్ట్ విజువల్ వండర్ అని ప్రమోటౌతున్న రామాయణ పార్ట్‌1.. ఇప్పుడు టాలీవుడ్ టు బాలీవుడ్ తెగ ట్రెండ్ ఔతోంది. అయోధ్య బాలరాముడి గుడిలో గోల్‌మాల్‌, హుండీ సొత్తు గాయబ్ లాంటి వార్తల్ని కూడా మరిపించే రేంజ్‌లో వైరలౌతోంది నితేష్ తివారీ రామాయణ. టాప్-20 ట్రెండింగ్ లిస్ట్‌లో 19వ ప్లేస్‌లో ఉంది. ఎందుకు? కళ్లుచెదిరే విజువల్ ఎఫెక్ట్స్‌తోనా? వరల్డ్‌క్లాస్ వీఎఫ్‌ఎక్స్‌తోనా? క్యారెక్టర్స్‌లో నటించడం మాని జీవించిన ఆర్టిస్టులతోనా? లేక మూడేళ్ల కిందట ఓం రౌత్ క్రియేటివ్ రామాయణం ‘ఆదిపురుష్’ని గుర్తు చేస్తున్నందుకా? ఎందుకింత సూపర్‌గా ట్రెండవుతోంది బాలీవుడ్‌లో ఈ కొత్త రామాయణం? బడ్జెట్ అక్షరాలా 4 వేల కోట్ల రూపాయలు. అందుకే ఫ్రేమ్‌ టు ఫ్రేమ్‌ భారీతనం కాదు అతిభారీతనం. రాముడిగా రణ్‌బీర్ కపూర్, రావణుడి క్యారెక్టర్‌లో రాకింగ్ స్టార్ యష్.. కింగ్‌సైజ్ పెర్ఫామెన్స్. సీతాదేవిగా సాయిపల్లవి, శూర్పణఖగా రకుల్‌ప్రీత్‌ సింగ్‌, లక్ష్మణ పాత్రకు రవిదూబే, కైకేయి పాత్రలో లారాదత్తా, శూర్పణఖ భర్తగా వివేక్‌ ఒబెరాయ్‌.. కీలకపాత్రన్నిట్లోనూ పాపులర్‌ స్టార్సే. ఏఆర్‌ రెహ్మాన్‌ పాటలు, హాలీవుడ్‌ మ్యుజీషియన్‌ హాన్స్‌ జిమ్మర్‌ బ్యాగ్రౌండ్‌ స్కోర్‌, ఆస్కార్ విన్నింగ్ స్టూడియో DNEG విజువల్ ఎఫెక్ట్స్‌, ఐమ్యాక్స్‌ ఫార్మాట్‌… దేనికవే అన్నీ తిరుగులేని కమర్షియల్ ఎలిమెంట్సే. రణ్‌బీర్ యాక్టింగ్, యష్‌ స్టయిల్ ఆఫ్ స్వాగ్, గ్రాండియర్ విజువల్స్‌.. అన్నీ ప్లస్...

Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి