బెంగళూరులో క్యాబ్ డ్రైవర్ ఇందు శేఖర్ అత్తింటి వారిపై కోపంతో దారుణానికి ఒడిగట్టాడు. భార్యతో సహా ఏడుగురిని వరుసగా హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మొదట భార్యను హత్య చేసి, ఆమె మృతదేహాన్ని కారులో పార్సల్ చేశాడు. అనంతరం బామర్దులను, ఇతర బంధువులను ఇంటికి పిలిపించి రోకలిబండతో మోది ప్రాణాలు తీశాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.