AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

4,218 కిలోమీటర్లు ఆటో రిక్షాలో ప్రయాణించి బ్రిటన్ జంట.. చివరికి!

4,218 కిలోమీటర్లు ఆటో రిక్షాలో ప్రయాణించి బ్రిటన్ జంట.. చివరికి!

Phani CH
|

Updated on: Nov 08, 2026 | 8:45 AM

Share

భారత్‌లో 75 రోజుల పాటు 4,218 కిలోమీటర్లు ఆటోలో ప్రయాణించిన ఓ బ్రిటన్‌ జంట, ఆ వాహనంపై ఏర్పడిన అనుబంధంతో దానిని తమ దేశానికి తీసుకెళ్లారు. ‘టిమ్మీ ది టిన్‌ క్యాన్‌’ అని పేరు పెట్టుకున్న చెన్నై రిజిస్ట్రేషన్‌ బజాజ్‌ ఆటోను సముద్ర మార్గంలో యూకేకు పంపించారు. ఆరు నెలల నిరీక్షణ తర్వాత అక్టోబర్‌ 23న లండన్‌ గేట్‌వే పోర్టుకు చేరుకోవడంతో ఈ కథ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

విదేశాలకు వెళ్లినప్పుడు అక్కడి అనుభవాలను గుర్తుగా ఫొటోలు, వీడియోలు, చిన్నచిన్న వస్తువులను తీసుకురావడం సాధారణం. కానీ ఓ బ్రిటన్ జంట మాత్రం భారత పర్యటనలో తమకు తోడుగా నిలిచిన ఆటోరిక్షాను వదిలి వెళ్లలేకపోయారు. దానితో ఏర్పడిన విడదీయరాని అనుబంధం కారణంగా, ఏకంగా సముద్ర మార్గం గుండా దానిని తమ సొంత దేశానికే తీసుకెళ్లి ఆశ్చర్యపరిచారు. ఈ ఆసక్తికర ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బ్రిటన్‌కు చెందిన హెలెన్ మిక్‌లు దంపతులు భారత్‌లో పర్యటించేందుకు నిర్ణయించుకున్నారు. తమిళనాడులోని చెన్నైలో రిజిస్టర్ చేయబడిన ఎరుపు, నలుపు రంగుల బజాజ్‌ ఆటో రిక్షా ద్వారా వారు దేశవ్యాప్తంగా యాత్ర చేపట్టారు. తమకు రవాణా సాధనంగా నిలిచిన ఆ మూడు చక్రాల వాహనానికి ‘టిమ్మీ ది టిన్ క్యాన్’ అని పేరు పెట్టుకున్నారు. ఆగ్రాతో సహా పలు ప్రాంతాలు తిరుగుతూ తాజ్‌మహల్‌ను కూడా అదే ఆటోలో సందర్శించారు. అలా సుమారు 75 రోజులపాటు భారత్‌లో 4,218 కిలోమీటర్లు ప్రయాణించారు. ఆటోతో ఏర్పడిన అనుబంధం వల్ల దానిని భారత్‌లోనే వదిలేసి వెళ్లలేకపోయిన ఆ దంపతులు, తమవెంట యూకేకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం సముద్ర మార్గం ద్వారా ఆటోను బ్రిటన్‌కు రవాణా చేసేలా ఏర్పాట్లు చేశారు. దాదాపు ఆరు నెలల నిరీక్షణ తర్వాత, అక్టోబర్ 23, 2026న ‘టిమ్మీ’ లండన్ గేట్‌వే పోర్ట్‌కు చేరుకుంది. భారతీయ రోడ్లపై తిరిగిన ఈ ఆటో ఇప్పుడు బ్రిటన్ వీధుల్లోకి అడుగుపెట్టింది. ఈ అసాధారణ ప్రయాణానికి సంబంధించిన విశేషాలను పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నారు. “భారతీయ రోడ్ల నుంచి బ్రిటిష్ వీధుల వరకు.. ఎంత అద్భుతమైన ప్రయాణం!” అంటూ ఆయన ప్రశంసించారు. బ్రిటన్ రోడ్లపై ఈ ఆటోను నడపడానికి తగిన అనుమతులు పొందాల్సి ఉండగా, ఈ విదేశీ దంపతుల సాహసాన్ని నెటిజన్లు ఎంతో అభినందిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దీపావళిని 5 రోజులు ఎందుకు జరుపుకుంటారు?

బెంగళూరు నుంచి హైదరాబాద్‌ 2 గంటలే..

ఐటీ ఉద్యోగుల నయా ట్రెండ్‌.. వర్క్ ఫ్రమ్ పార్క్

నా వనవాసం ఎప్పుడు ముగుస్తుంది? రేణుదేశాయ్‌ కామెంట్స్‌ వైరల్‌

తెరపై నటులు.. కానీ నిజ జీవితంలో దొంగలు

Follow Us