తెరపై నటులు.. కానీ నిజ జీవితంలో దొంగలు
మలయాళ నటి అతుల్య చంద్ర, నటుడు-నిర్మాత బిబిన్ పెరుంబిల్లి కొచ్చిలో ఓ వైద్యుడిపై దాడి చేసి దోపిడీకి పాల్పడ్డారనే ఆరోపణలతో అరెస్టయ్యారు. అత్యవసర వైద్యసాయం పేరుతో డాక్టర్‌ను అపార్ట్‌మెంట్‌కు పిలిపించగా, అక్కడ మరికొందరు కలిసి ఆయనపై దాడి చేసి ఫోన్, స్మార్ట్‌వాచ్, ఇయర్‌ఫోన్స్ తీసుకున్నట్లు ఫిర్యాదు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం, ఇద్దరు నటులతో పాటు మరో వ్యక్తిని అరెస్టు చేశారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు.
ఇప్పుడు నేనే చెబుతున్న ఈ ఇద్దరూ తెరపై నటులు. నిజజీవితంలో మాత్రం దొంగలు. ఈ విషయం తెలిసి తోటీ యాక్టర్స్ అవాక్కవుతున్నారు. తెలుగు హిట్ సినిమా ‘మత్తు వదలరా’తో నటిగా మారిన మలయాళ బ్యూటీ అతుల్య చంద్ర.. ఆపై సొంత భాషలో మూండ్ర కన్, ఉయిర్, డైస్ ఈరే మూవీస్ చేసింది. ఇప్పుడు ఏమైందో ఏమో తెలీదు గానీ ఓ డాక్టర్ని ఇంటికి పిలిపించుకుని అతడిని దోచేసింది. ఈమెకు మరో నటుడు సాయం చేశాడు. ఈ ఘటన ఇప్పుడు ఫిల్మ్ పెటర్నిటీలో షాకింగ్‌గా మారింది. కేరళలోని కొచ్చిలో అతుల్య చంద్ర.. నటుడు-నిర్మాత బిబిన్ పెరుంబిల్లితో కలిసి సోమవారం, తన అపార్ట్మెంట్ నుంచి స్థానిక వైద్యుడికి ఫోన్ చేసింది. తన బంధువుకి అత్యవసర వైద్యసాయం అందించేందుకు ఇంటికి రావాలని ఆయనతో చెప్పారు. ఉదయం ఆరున్నరకు డాక్టర్.. వాళ్ల ఫ్లాట్‌కి వెళ్లేసరికి అక్కడ మొత్తం 12 మంది యువతీయువకులు ఉన్నారు. వీళ్లంతా కలిసి సదరు డాక్టర్‌పై దాడి చేశారు. వైద్యుడి దగ్గరున్న ఫోన్, స్మార్ట్‌వాచ్, వైర్లెస్ ఇయర్‌ఫోన్స్ లాక్కుని.. ఇదంతా పోలీసులకు చెబితే వైద్యం కోసమని వచ్చి, తమ బంధువుపై అత్యాచారానికి ప్రయత్నించావని కేసు పెడతామని బెదిరించారు. కొన్ని గంటల తర్వాత అక్కడి నుంచి తప్పించుకున్న డాక్టర్.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ సంగతి బయటపడింది. ఇద్దరు నటలుతో పాటు మరొకరిని అరెస్ట్ చేశామని, మిగిలిన వాళ్లకోసం వెతుకుతున్నామని పోలీసులు చెప్పారు. అయితే ఈ డాక్టర్ని ఎందుకు పిలిచారు? వీళ్ల ఉద్దేశం ఏంటనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కీరవాణి ఇంట పెళ్లి సందడి షురూ.. శుభకార్యం వచ్చే నెలలోనే..
నాకు తెలిసిన అతను స్వార్థపరుడు.. ముఖేష్ ఆటపై జగతి షాకింగ్ రివ్యూ..
సౌత్ హీరోయిన్లు అంటే చిన్నచూపా.. మీరేమన్నా తోపులా..
ప్యాసింజర్ లగేజ్ చెక్ చేసిన పోలీసులకు దిమ్మతిరిగిపోయే ట్విస్ట్
మానవత్వాన్ని చాటిన కానిస్టేబుల్.. ఏం చేశాడంటే?
హాస్టల్ గదుల్లో నాగుపాములు, తేళ్లు..విద్యార్థినులను కరిచిన ఎలుకలు
డైరెక్టర్ అవుదామనుకున్నాడు.. కట్ చేస్తే దొంగయ్యాడు!
గ్యాస్ వినియోగదారులకు బిగ్ రిలీఫ్.. ఇక ఓటీపీతో పని లేదు!
ఆ ఇల్లే ఒక పాముల పుట్ట.. అడుగడుగునా పాము గుడ్లే!
చదువు నేర్పిన గురువుకు అరుదైన గౌరవం!

