కీరవాణి ఇంట పెళ్లి సందడి షురూ.. శుభకార్యం వచ్చే నెలలోనే..
ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి కుమారుడు కాల భైరవ, నటి కావ్య కల్యాణ్ రామ్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. వచ్చే నెలలో వివాహం జరగనున్న నేపథ్యంలో కావ్య ఇంట్లో పెళ్లి పనులు మొదలయ్యాయి. ఈ వేడుకలో కీరవాణి కుటుంబంతో పాటు దర్శకుడు రాజమౌళి, ఆయన భార్య రమ కూడా పాల్గొన్నారు. కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి కొడుకు కాల భైరవ, హీరోయిన్ కావ్య కల్యాణ్ రామ్ వచ్చే నెలలోనే పెళ్లి చేసుకోనున్నారు. ఇందులో భాగంగానే వివాహానికి సంబంధించిన పనులు మొదలైపోయాయి. ఈ ఫొటోలని కావ్య తండ్రి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కీరవాణి పెద్ద కొడుకు అయిన కాల భైరవ.. గాయకుడు, సంగీత దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. బాలనటిగా కెరీర్ మొదలుపెట్టి హీరోయిన్గా పలు సినిమాలు చేసిన కావ్య కల్యాణ్ రామ్‌తో ప్రేమలో పడ్డాడు. ఇంట్లో వాళ్లని ఒప్పించి ఈ ఏడాది ఆగస్టు 31న తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించారు. అప్పట్లోనే నిశ్చితార్థం కూడా జరిగినట్లు తెలుస్తోంది.వచ్చే నెలలో పెళ్లి జరగనున్న సందర్భంగా ఆడపిల్ల ఇంట్లో పెళ్లి పనులు మొదలయ్యాయి. ఈ వేడుకకు కీరవాణి కుటుంబంతో పాటు రాజమౌళి, ఇతడి భార్య రమ కూడా పాల్గొని కాబోయే వధూవరుల్ని ఆశీర్వదించారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఇకపోతే టాలీవుడ్ లో రాబోయే నెలలో చాలానే శుభకార్యాలు జరగబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మెగాహీరో సాయితేజ్, తన చిన్ననాటి స్నేహితురాలు కిరణ్మయితో నిశ్చితార్థం చేసుకోగా.. హీరో తేజా సజ్జా కూడా వచ్చే నెలలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నాకు తెలిసిన అతను స్వార్థపరుడు.. ముఖేష్ ఆటపై జగతి షాకింగ్ రివ్యూ..
సౌత్ హీరోయిన్లు అంటే చిన్నచూపా.. మీరేమన్నా తోపులా..
ఆ స్టార్ హీరో చేసిన చెడ్డ అలవాటు.. ఈ నటుడినే బలితీసుకుంది!
ప్యాసింజర్ లగేజ్ చెక్ చేసిన పోలీసులకు దిమ్మతిరిగిపోయే ట్విస్ట్
మానవత్వాన్ని చాటిన కానిస్టేబుల్.. ఏం చేశాడంటే?
హాస్టల్ గదుల్లో నాగుపాములు, తేళ్లు..విద్యార్థినులను కరిచిన ఎలుకలు
డైరెక్టర్ అవుదామనుకున్నాడు.. కట్ చేస్తే దొంగయ్యాడు!
గ్యాస్ వినియోగదారులకు బిగ్ రిలీఫ్.. ఇక ఓటీపీతో పని లేదు!
ఆ ఇల్లే ఒక పాముల పుట్ట.. అడుగడుగునా పాము గుడ్లే!
చదువు నేర్పిన గురువుకు అరుదైన గౌరవం!

