AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహేష్‌కు పాట పాడడమే.. నా జీవితంలో అతిపెద్ద తప్పు!

మహేష్‌కు పాట పాడడమే.. నా జీవితంలో అతిపెద్ద తప్పు!

Phani CH
|

Updated on: Nov 07, 2026 | 7:01 PM

Share

టాలీవుడ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఆర్పీ పట్నాయక్‌ తన కెరీర్‌లో చేసిన ఓ నిర్ణయంపై పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. మహేష్‌ బాబు నటించిన ‘నిజం’ సినిమా కోసం తాను పాట పాడటమే జీవితంలో చేసిన పెద్ద తప్పని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తన వాయిస్‌ మహేష్‌ వంటి సూపర్‌ హీరోకు సెట్‌ కాలేదని, కిడ్డిష్‌గా అనిపించిందని చెప్పారు. అప్పటి పరిస్థితుల్లో పాడాల్సి వచ్చిందని, ఆ పాటకు తాను గాయకుడిగా ఉండకూడదని అనుకున్నానని వివరించారు.

టాలీవుడ్ ఫిల్మ్ ఫెటర్నిటీలో.. తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని క్రియేట్ చేసుకున్న మ్యూజిక్ డైరెక్టర్ ఆర్‌పీ పట్నాయక్ . తన ట్యూన్స్‌తో.. టోన్‌తో అప్పట్లో ఎన్నో సూపర్ హిట్ పాటలను కంపోజ్ చేశారు. వన్ ఆఫ్ ది టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా కూడా ట్యాగ్ వచ్చేలా చేసుకున్నారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న ఆర్పీ.. తన రీసెంట్‌ ఇంటర్వ్యూలో సూపర్ స్టార్ మహేష్‌ బాబుకు తాను పాట పాడడమే తన జీవితంలో చేసిన అతి పెద్ద తప్పంటూ షాకింగ్‌ కామెంట్ చేశారు. అదే తనకున్న పెద్ద రిగ్రెట్ అంటూ.. ఎమోషనల్ గా చెప్పుకొచ్చారు. తన మాటలతో ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతున్నారు ఆర్పీ. తేజ సినిమాలతో.. మ్యూజిక్ డైరెక్టర్ ఛాన్స్ దక్కించుకున్న ఆర్పీ.. తన క్యాచీ అండ్ మెలోడీ ట్యూన్స్ తో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువయ్యారు. అయితే ఈయన కంపోజింగ్‌లో ఎక్కువ సాంగ్స్ ఈయనే పాడుకున్నారు. అలా మహేష్‌ బాబు నిజం సినిమా కోసం.. ఓ పాట పాడారు ఆర్పీ పట్నాయక్. అయితే వినడానికి సాంగ్ బాగున్నప్పటికీ.. మహేష్‌ విజువల్‌తో చూస్తే.. ఆర్పీ వాయిస్ తీవ్ర విమర్శలకు గురైంది. ఆర్పీ వాయిస్ మరీ కిడ్డిష్‌గా ఉందని.. మహేష్‌కు అస్సలు సెట్ అవ్వలేదని చాలా మంది కామెంట్ చేశారు. అయితే ఇదే విషయాన్ని తన రీసెంట్‌ ఇంటర్వ్యూలో ప్రస్థావించిన ఆర్పీ.. తాను ఆ పాట పాడకుండా ఉండాల్సి అంటూ మరో సారి చెప్పుకొచ్చారు. తన వాయిస్ కాస్త కిడ్డిష్‌గా ఉందని.. అది మహేష్ బాబు వంటి “సూపర్ హీరో”కి అస్సలు సూట్ కాదని ఆయన బలంగా నమ్ముతున్నానని అన్నారు. కానీ అప్పటి పరిస్థితులు తనను పాడేలా ప్రేరేపించాయని ఆర్పీ చెప్పుకొచ్చారు. కానీ తన అప్పట్లో తీసుకున్న ఆ నిర్ణయంపై తీవ్ర పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేశారు ఆర్పీ. అంతేకాదు ఆ సినిమాకు ఒక గాయకుడిగా తాను వంద శాతం పాడకూడదనే అనుకున్నానని.. కానీ తప్పక పాడాల్సి వచ్చినట్టు చెప్పుకొచ్చారు ఆర్పీ.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నా కడపు నిండుతోంది కేసీఆర్‌ సార్‌ వల్లే.. జబర్దస్త్‌ కమెడియన్ ఎమోషనల్

కెరీర్ ఇచ్చిన ఇండస్ట్రీ మీద నిందలు వేస్తావా.. రాధికకు పాయల్ స్ట్రాంగ్ కౌంటర్

Follow Us